Begin typing your search above and press return to search.

బాహుబలి 2 ఫస్ట్ లుక్ ఇదిగో..

By:  Tupaki Desk   |   22 Oct 2016 12:02 PM GMT
బాహుబలి 2 ఫస్ట్ లుక్ ఇదిగో..
X
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఇవాళ పొద్దునే వచ్చేసింది. సాయంత్రం బాహుబలి2 ఫస్ట్ లుక్ అంటే.. ఆ సమయంలో కోసం సోషల్ నెట్వర్క్ సైట్లను పట్టుకుని అభిమానులు తెగ ఎదురుచూసేశారు. ఇప్పుడా లుక్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా రెండో బాహుబలి లుక్ ని వదిలేశాడు జక్కన్న.

చేతికి ఓ టన్ను బరువులు గొలుసులు చుట్టుకున్న ప్రభాస్.. బాహుబలి ఫస్ట్ లుక్ లో కనిపిస్తాడు. మరో చేతిలో ఒడుపైన పదునైన ఖడ్గం ఉంది. బాహుబలికి కాదు.. ప్రభాస్ చేతిలో ఆ కత్తికే అందం వచ్చినట్లుగా ఉంది. ఇక పర్సనాలిటీ విషయంలో బాహుబలిని కొట్టేవాడు పుట్టలేదని అనాల్సిందే. మహేంద్ర బాహుబలిగా 6ప్యాక్ చేసిన ప్రభాస్ ను చూస్తుంటే.. ఒళ్లు తన్మయత్వంతో ఊగిపోవడం ఖాయం. వీటన్నిటికీ మించి ప్రభాస్ కళ్లలో కనిపిస్తున్న కసి.. ఆవేశం ముందు వేరేవన్నీ దిగదుడుపే.

ఇక బ్యాక్ గ్రౌండ్ లో మరో ప్రభాస్ కూడా ఉన్నాడు. అమరేంద్ర బాహుబలి గెటప్ లో ఉన్న రూపం.. బీజీ లో కనిపిస్తుంది. హ్యాపీ బర్త్ డే 2 ప్రభాస్ అన్నట్లుగా.. రాసిన లెటరింగ్ అదరహో అనాల్సిందే. మొత్తం మీద 2 దిం కంక్లూజన్ అనే అక్షరాలు మాత్రం బాగా హైలైట్ అవుతున్నాయి. పోస్టర్ వేసిన థీమ్ గానీ.. ప్రభాస్ లుక్స్ కానీ.. బాహుబలి ది కంక్లూజన్ పై అంచనాలను వంద రెట్లు పెంచేసే స్థాయిలో ఉన్నాయ్ మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/