Begin typing your search above and press return to search.

ఇక డబ్బింగ్ టైటిల్స్ ఇలా ఉంటాయేమో

By:  Tupaki Desk   |   29 April 2017 5:08 AM GMT
ఇక డబ్బింగ్ టైటిల్స్ ఇలా ఉంటాయేమో
X
ఓ సినిమా కానీ.. అందులో పాట కానీ మాంచి హిట్ అయిందంటే చాలు.. అందులోని పాత్రల పేర్లు పాటల్లో లైన్లు కూడా టైటిట్స్ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది సాధించిన ఘన విజయం తెలిసిందే. ఇప్పటికే కాటమరాయుడు అంటూ తనే పాడిన పాట లైన్ తో.. మళ్లీ తనే సినిమా చేశాడు పవన్. ఇక కెవ్వు కేక.. గౌతమ్ నంద.. ఆరడుగుల బుల్లెట్ ఇలా వరుస సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి.

ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ ఏ స్థాయి విజయం సాధించనుందో కనిపిస్తూనే ఉంది. ఇకపై ఈ సినిమా పాత్రల పేర్లతో సినిమాలు రావడం పెద్ద విశేషమేమీ ఉండదు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల కోసం ఎవరినీ వదలక పోవచ్చు. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన సినిమాలను.. కట్టప్ప.. కట్టప్ప కట్టుబానిస ఇలాంటి టైటిల్స్ తో టాలీవుడ్ జనాలపైకి వదలచ్చు. నాజర్ ఏదైనా సినిమాకు బిజ్జల దేవుడు టైటిల్ బాగానే నప్పుతుంది. శివగామి.. దేవసేన.. అవంతిక.. పేర్లను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకో.. హారర్ మూవీస్ కో వాడేయడం తథ్యం.

మాహిష్మతి.. మాహిష్మతి సామ్రాజ్యం.. కుంతల దేశం కూడా హారర్ థ్రిల్లర్ సినిమాలకు నప్పే టైటిల్ అని చెప్పచ్చు. మమతల తల్లి పేరుతో ఓ ఫ్యామిలీ డ్రామా మొదలైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక బాహుబలి మళ్లీపుట్టాడు అంటూ యాక్షన్ సినిమాకు ఓ పేరు తగిలించేయచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/