Begin typing your search above and press return to search.

బాహుబలి-2 లెక్క 350 కోట్లు

By:  Tupaki Desk   |   25 April 2017 12:10 PM GMT
బాహుబలి-2 లెక్క 350 కోట్లు
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏ రకంగా చూసినా ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీనే. బడ్జెట్.. రిలీజ్ అవుతున్న థియేటర్లు.. ప్రి రిలీజ్ బిజినెస్.. శాటిలైట్ రైట్స్.. ఇలా ఎందులో చూసినా పాత రికార్డులన్నీ చెరిగిపోయేవే. విడుదల తర్వాత కలెక్షన్ల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవడం ఖాయమనే భావిస్తున్నారు. ఈ చిత్రానికి జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. ప్రస్తుతం అంచనాల ప్రకారం ‘బాహుబలి-2’ అన్ని రకాలుగా కలిపి రూ.440 కోట్ల దాకా ఆదాయం తెచ్చిపెట్టింది నిర్మాతలకు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ.130 కోట్ల దాకా బిజినెస్ చేయడం విశేషం.

మిగతా భాషలు.. రాష్ట్రాల సంగతి చూస్తే.. కర్ణాటకకు రూ.36 కోట్ల అడ్వాన్స్ తో బయ్యర్ హక్కులు సొంతం చేసుకున్నాడు. తమిళనాడు రైట్స్ రూ.47 కోట్లు పలికాయి. కేరళ రైట్స్ రూ.11 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇండియాలో మిగతా రాష్ట్రాలన్నింటికీ కలిపి రైట్స్ రూ.70 కోట్ల మేర అడ్వాన్స్ తో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఉత్తర అమెరికా మొత్తానికి కలిపి రూ.44 కోట్ల దాకా బిజినెస్ చేసింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. మిగతా దేశాల్లో ‘బాహుబలి-2’ ఇండియన్ వెర్షన్ హక్కుల్ని రూ.20 కోట్లకు అమ్మారు. కొన్నాళ్ల తర్వాత పలు దేశాల్లో ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు.

మొత్తంగా వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.350 కోట్లను దాటిపోయింది. ఇది కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. ఇంకా శాటిలైట్ హక్కులు.. ఆడియో హక్కులు ఉన్నాయి. బాహుబలిని ఇంకా అనేక రకాలుగా మార్కెట్ చేస్తున్నారు. ఆ లెక్కలన్నీ కలిపితే రూ.500 కోట్లు ఈజీగా దాటిపోతాయి. మొత్తంగా బాహుబలి-2 ఎంత ఆదాయం తెచ్చిందన్నది క్లారిటీ రావడానికి చాలా సమయం పడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/