Begin typing your search above and press return to search.

బాహుబలి2 మోషన్ పోస్టర్.. వారెవా!!

By:  Tupaki Desk   |   24 Feb 2017 7:11 AM GMT
బాహుబలి2 మోషన్ పోస్టర్.. వారెవా!!
X
బాహుబలి 2.. దేశవ్యాప్తంగా జనాలు తెగ ఎదురుచూసేస్తున్న సినిమా ఇది. అంచనాలు కూడా ఆకాశాన్ని అంటే స్థాయిలోనే ఉన్నాయి. పైగా ఈ సినిమాని థియేటర్లలోకి తెచ్చేందుకు నిర్ణయించిన డేట్ కు 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ చేసేందుకు నిర్ణయించగా.. కనీసం ఫిబ్రవరి 24న మహాశివరాత్రి సందర్భంగా కనీసం ఓ టీజర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి.

అయితే.. ఆ లోటు బయటకు కనిపించకుండా ఏదో ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి సరిపెట్టేస్తున్నారు. పండుగ రోజున ఉదయాన్నే ఓ లుక్ ని రివీల్ చేసి.. దానికే సంబంధించిన మోషన్ పోస్టర్ ని తర్వాత లాంఛ్ చేశారు. తాజాగ రిలీజ్ చేసిన పోస్టర్ లో.. ఏనుగు తొండంపై నుంచి కుంభస్థలానికి చేరుకుంటున్న ప్రభాస్ లుక్.. వీరోచితంగా ఉంది. బాహుబలి విషయంలో రాజమౌళి ప్రతీ ఫ్రేమ్ ఎన్నేసి జాగ్రత్తలు తీసుకున్నాడనే విషయం కనిపిస్తూనే ఉంటుంది. బాహుబలికి ఇలాంటివి సర్వసాధారణం అని మెప్పించే స్థాయిలోనే తాజా పోస్టర్ ఉండడం విశేషం.

అలాగని ఫస్ట్ లుక్.. ఆ తర్వాత అనుష్కతో కలిపి విల్లంబులు అందుకున్న ప్రభాస్ పోస్టర్ లతో పోల్చితే.. అంతగా గ్రాఫిక్స్ వాడకం ఈ మోషన్ పోస్టర్ కనిపించలేదు. బాహుబలి2 విషయంలో తొలిసారిగా తన టేస్ట్ ను చూపించాడు రాజమౌళి. అయితే.. శివరాత్రి సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేస్తారని అనుకుంటే.. ఈ పోస్టర్ తో సరిపుచ్చేయడం నిరాశ కలిగించే విషమయే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/