Begin typing your search above and press return to search.

బాహుబ‌లి... ద లాస్ట్ లెజెండ్స్ యానిమేషన్!

By:  Tupaki Desk   |   1 Oct 2016 8:31 AM GMT
బాహుబ‌లి... ద లాస్ట్ లెజెండ్స్ యానిమేషన్!
X
బాహుబ‌లి ఇక‌పై ఓ సినిమా మాత్ర‌మే కాదు.. ఒక బ్రాండ్ గా అవ‌త‌రించ‌బోతోంద‌ని చెప్పాలి. ఎందుకంటే, ఈ సినిమా రెండో భాగంతోపాటు బాహుబ‌లి పేరుమీద మ‌రికొన్ని ప్రాడెక్ట్స్ ను కూడా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. బాహుబ‌లి... ఈ చిత్రం రెండో భాగం కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు. తొలి భాగం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించ‌డంతో రెండోభాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. అయితే, ఈ రెండు చిత్రాల‌తోనే బాహుబ‌లి ప్రాజెక్టును ఆపే ఉద్దేశంతో లేద‌ని అంటున్నారు. ఈ ఫ్రాంచైజీని ఇంకా కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. అంటే, బాహుబ‌లికి మ‌రిన్ని సీక్వెల్స్ తీసే ఆలోచ‌న‌లో ఉన్నారు. దాంతోపాటు బాహుబ‌లి యానిమేటెడ్ సిరీస్‌, విర్చువ‌ల్ రియాలిటీ వీడియోస్ ప్లాన్ చేస్తున్నారు.

శుక్ర‌వారంనాడు బాహుబ‌లికి సంబంధించి వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీన్లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాట్లాడుతూ... బాహుబ‌లికి సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర‌మై విష‌యాల‌ను అక్టోబ‌ర్ నెల‌లో ఒక్కోటిగా బ‌య‌ట‌పెడ‌దాం అని చెప్పారు. ఇక‌, యానిమేటెడ్ సిరీస్ విష‌యానికొస్తే... బాహుబ‌లి - ది లాస్ట్ లెజెండ్స్ పేరుతో ఇది రాబోతోంది. దీన్ని ఏమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇంత‌వ‌ర‌కూ హాలీవుడ్ సూప‌ర్ హీరోస్ కి యానిమేటెడ్ సిరీస్ రావ‌డం మ‌నం చూశాం. ఇప్పుడు మ‌న బాహుబ‌లి పాత్ర‌లు కూడా అదే మాదిరిగా 2డీ యానిమేష‌న్స్ లో రాబోతున్నాయి.

ఇక‌, వ‌ర్చువ‌ల్ రియాలటీ విష‌యానికొస్తే... మాహిష్మ‌తి సామ్రాజ్యాన్ని మ‌న క‌ళ్ల‌ముందు ఆవిష్క‌రించ‌బోతున్నారు. ప్ర‌త్యేకమైన క‌ళ్ల‌జోడు సాయంతో మాహిష్మతి రాజ్యాన్ని 360 డిగ్రీలో చూసే అవ‌కాశం ఉంటుంది. అంటే, ఆ రాజ్యంలో మ‌నం తిరుగుతూ ఉన్న అనుభూతి క‌లుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 25 కోట్లు బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు చెప్పారు. మొత్తానికి బాహుబ‌లి రెండో భాగం విడుద‌ల అయ్యేలోపుగా ఇంకా ఎన్నో అద్భుతాలు ప‌రిచ‌యం కాబోతున్నాయన్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/