Begin typing your search above and press return to search.

సరికొత్త లుక్ తో జవాన్

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:32 AM GMT
సరికొత్త లుక్ తో జవాన్
X
మొదటి నుంచి కామెడీ యాక్షన్ కలగలిపిన చిత్రాలతో తనదైన స్టయిల్ లో ముందుకెళ్లిపోతున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఈ జోనర్ తనకు బాగా కలిసిరావడంతో పాటు ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటుండటంతో తేజూ కూడా అదే దారిలో వెళ్లిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న జవాన్ లో అతడిని అంతా ఓ కొత్త లుక్ తో చూస్తారని డైరెక్టర్ బి.వి.ఎస్.రవి చెబుతున్నాడు.

అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న జవాన్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జవాన్ అనే టైటిల్ చూడగానే అందరూ ఇది దేశభక్తి తరహా చిత్రం అనుకుంటారని.. కానీ బేసిగ్గా ఇది థ్రిల్లర్ చిత్రమని యూనిట్ సభ్యుడొకరు చెప్పారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉంటాయన్నారు. `అన్యాయానికి ఎదురుతిరిగే యువకుడి పాత్రంలో తేజూ కనిపించబోతున్నాడు. ఇందులో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

జవాన్ టీజర్ ను పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. ఇందులో తేజు లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబరు మొదటికే థియేటర్లకు తీసుకురావాలని భావించారు. కానీ అప్ఫటి పోటీని దృష్టిలో పెట్టుకుని సినిమా టీం వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గినట్టు టాక్. స్పైడర్ తర్వాత పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేనందున అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ సన్నాహాల్లో ఉన్నారు.