Begin typing your search above and press return to search.

లేడీ డైరక్టర్‌.. ఈసారి ఏమవుతుందో

By:  Tupaki Desk   |   30 May 2016 1:30 PM GMT
లేడీ డైరక్టర్‌.. ఈసారి ఏమవుతుందో
X
మనకున్న అతి తక్కువమంది లేడీ డైరక్టర్లలో బి.జయ ఒకరు. దాదాపు 13 ఏళ్ల క్రింద డైరక్షన్‌ పగ్గాలు పట్టిన ఆవిడ.. ఇప్పటివరకు కేవలం 5 సినిమాలే తీసింది. ఇప్పుడు తన 6వ సినిమా ''వైశాఖం''తో ముందుకు రానుంది. ఈ సినిమా పాటలను వేరే దేశంలో చిత్రీకిరించిన సందర్భంగా.. ఆ విషయాన్ని ప్రెస్ మీట్‌ పెట్టి మరీ తెలియజేశారు ఈరోజు.

డెబ్యూ చిత్రం చంటిగాడు తరువాత.. జయకు పేరు తెచ్చిన సినిమా మొన్న వచ్చిన లవ్‌లీ సినిమా ఒక్కటే. మధ్యలో వచ్చిన సినిమాలన్నీ యావరేజ్‌ గానే మిగిలిపోయాయ్‌. ఇకపోతే లవ్‌ లీ కూడా కమర్షియల్‌ గా అంతపెద్ద సక్సెస్ కాదు. ఈ తరుణంలో ఆమె ''వైశాఖం'' అంటూ మరో లవ్ స్టోరీతో వస్తుండటంతో.. ఈసారి ఖచ్చితంగా ఈ లేడీ డైరక్టర్ సక్సెస్ అవ్వాలనే చాలామంది కోరుకుంటున్నారు. అయితే లవ్‌లీ సినిమా కోసం ఎలాగైతే టర్కీ దేశంలో ఎముకులు కొరికే చలిలో షూటింగ్‌ చేశారో.. ఇప్పుడు కూడా మాజీ సోవియట్‌ యునియన్‌ దేశమైన కజకస్తాన్‌ లో అలాగే షూటింగ్‌ చేశారట. పాటలు కొత్తగా ఉంటాయి సరే.. మరి కంటెంట్‌ కూడా అలాగే ఉండాలి. అప్పుడే వైశాఖం చైత్రం మాగం అన్నీ వర్కవుటవుతాయి.

ఇకపోతే ''వైశాఖం'' సినిమాలో హీరోగా కొత్త కుర్రాడు హరీశ్‌ నటిస్తుంటే.. హీరోయిన్‌ గా మాయ సినిమా ఫేం అవంతికా మిశ్రా నటిస్తోంది. పాటల స్టిల్స్ చూస్తుంటే.. అమ్మడి అందాల ఆరబోతే కుర్రకారును పడేసేలా ఉంది. అది సంగతి.