Begin typing your search above and press return to search.

ఆ దానం చేశానంటున్న పాపులర్ హీరో

By:  Tupaki Desk   |   12 Dec 2018 10:59 AM GMT
ఆ దానం చేశానంటున్న పాపులర్ హీరో
X
బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' టాక్ షో చాలా పాపులర్. రెగ్యులర్ టీవీ షోలకు భిన్నంగా ఈ షో చాలా బోల్డ్ గా సాగుతుంది. పర్సనల్ లైఫ్ గురించి.. రూమర్ల గురించి.. ఆఖరికి సెక్సువల్ ఓరియెంటేషన్ గురించి కూడా ఓపెన్ గా అడుగుతాడు. ఫేవరెట్ సెక్స్ పొజిషన్ల గురించి అడిగేందుకు కూడా కరణ్ వెనుకాడడు.. దీనిపై విమర్శలు ఉన్నా అలాంటివి అసలు పట్టించుకోడు. ఇక ఈ షో కు వచ్చే సెలబ్రిటీలు కూడా చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తుంటారు.

ఈమధ్య కాఫీ విత్ కరణ్ షోకు ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశల్ ఇద్దరూ హాజరయ్యారు. ఆయుష్మాన్ గతంలో 'విక్కీ డోనార్' అనే సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో వీర్యదానం చేసే యువకుడి పాత్రలో ఆయుష్మాన్ నటించాడు. ఈ విషయం గురించి కరణ్ మాట్లాడుతూ 'రియల్ లైఫ్ లో నువ్వెప్పుడైనా అలాంటి పని చేశావా?' అని అడిగాడు. ఆయుష్మాన్ తడుముకోకుండా 'యస్' అన్నాడు.

రియల్ లైఫ్ లో వీర్యదానం చేశానని.. ఆ విషయాన్ని 'విక్కీ డోనార్' దర్శకుడు షుజిత్ సర్కార్ కు కూడా గతంలోనే తెలిపానని వెల్లడించాడు. ఇది నిజంగానే ప్రేక్షకులకు షాకే. ఏదేమైనా బాలీవుడ్ జనాలు మనోళ్ళకంటే స్పీడేనబ్బా..!!