Begin typing your search above and press return to search.

నాగ్ హీరోయిన్ కౌంటర్ ఇచ్చిందిగా

By:  Tupaki Desk   |   19 Jun 2018 6:31 AM GMT
నాగ్ హీరోయిన్ కౌంటర్ ఇచ్చిందిగా
X
సినిమా తారలు ఏ మాత్రం అతి చేసినా కూడా వారి మీద ట్రోల్స్ రావడం సహజం. ఇక వారి శరీరాకృతిలో కొంచెం తేడా వచ్చినా కూడా మరో స్థాయిలో కామెంట్స్ చేయడం కూడా కామన్. సర్జరీ చేసుకున్న తారలపై కూడా ఎప్పుడు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. గత కొంత కాలంగా అయేషా టాకియా కూడా అందుకు సంబందించిన ట్రాల్స్ ని ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న కామెంట్స్ పై ఇటీవల స్పందించింది.

చాలా కాలం తరువాత అయేషా మీడియా ముందుకు వచ్చింది. ఏడేళ్ల తరువాత ఒక ఫోటో షూట్ నిర్వహించారు. అయితే ఆమె లిప్స్ కొంచెం వాచినట్లు అనిపించడం కూడా ట్రాల్స్ కి కారణం. మీడియాలోనే ఎక్కువగా సెటైరికల్ న్యూస్ లు వచ్చాయి. అయితే వాటి గురించి తాను అంతగా పట్టించుకోనని అయేషా తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై కూడా తాను స్పందించను అని తెలిపింది. సోషల్ మీడియాలో ఇతరులను ఇబ్బంది పెట్టె విషయాల గురించి కాకుండా మంచి విషయాల గురించి స్పందిస్తే బావుంటుందని అమ్మడు కౌంటర్ ఇచ్చింది.

అయేషా 2005లో నాగార్జున - సూపర్ సినిమాతో టాలీవుడ్ జనాలకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లను దక్కించుకొని అమ్మడు 2011 వరకు బాగానే నెట్టుకొచ్చింది. ఇక ఫైనల్ గా ఒక పొలిటిషియన్ కొడుకుని పెళ్లాడి అమ్మడు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.