Begin typing your search above and press return to search.

నాగ్ హీరోయిన్.. ఘోరం జరిగిపోయింది

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:52 AM GMT
నాగ్ హీరోయిన్.. ఘోరం జరిగిపోయింది
X
అక్కినేని నాగార్జున సినిమా ‘సూపర్’ ఫ్లాప్ అయినప్పటికీ అందులో కథానాయికగా నటించిన ఆయేషా టకియాను తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. తెలుగులో మళ్లీ ఇంకో సినిమా చేయని ఆయేషా.. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన ‘వాంటెడ్’ లాంటి సినిమాలు చేసి బాగానే పాపులారిటీ సంపాదించింది. ఎద సౌందర్యం మరీ ఎక్కువైపోయిందని ఆమె అప్పట్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన అందాలకు మెరుగులు దిద్దుకోవడం కోసం చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది.

ముఖం మీద ప్లాస్టిక్ సర్జరీ పేరుతో చేసిన ప్రయోగం వికటించి.. ఇప్పుడు ఆయేషా గుర్తు పట్టలేని స్థితికి చేరుకుంది. ఆయేషాను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మరిచిపోయి చాలా కాలమైంది. ఆమె చేతిలో అవకాశాలేమీ లేనట్లే ఉంది. మరి ఏం సాధించేద్దామని సర్జరీ చేయించుకుందో కానీ.. దాని పుణ్యమా అని ముఖమే మారిపోయి గుర్తు పట్టలేనట్లు తయారైంది ఆయేషా. తాజాగా ఒక ఫ్యాషన్ షో కోసం హాజరైన ఆయేషాను చూసి జనాలు షాకైపోయారు. అయినా ఆయేషా ముఖంలో ఏం లోపం ఉందని సర్జరీ చేయించుకుందో కూడా అర్థం కాదు. ఆమెలో అందానికి లోటేమీ లేదు. అయినా సర్జరీకి వెళ్లి.. ముఖం రూపురేఖలే మారిపోయి గుర్తుపట్టలేనట్లుగా తయారైంది. ప్లాస్టిక్ అందాల మీద మోజు ఎంతటి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందో చెప్పడానికి ఇది రుజువు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/