సూపర్ హీరోయిన్ వాటీజ్ దిస్?

Mon Oct 22 2018 15:57:10 GMT+0530 (IST)

గిచ్చి గిచ్చి చంపమాకు హొయ్ లా.. అంటూ ఓ క్యూటీ సూపర్బ్ ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసింది. ఆ బ్యూటీ గుర్తుందా?  పోనీ.. కింగ్ నాగార్జున కథానాకుడిగా నటించిన `సూపర్` సినిమా గుర్తుందా? ఆ సినిమాతోనే అందాల కథానాయిక అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి టాలీవుడ్ కి పరిచయమైంది. అదే సినిమాతో వేరొక డస్కీ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. ఇంతవరకూ ఏ స్క్రీన్ పైనా కనిపించని డిఫరెంటు అందం తన సొంతం. హస్కీ.. డస్కీ.. ఛమ్కీ బ్యూటీ.. ఎంత ఫ్రెష్ గా ఉందో అంటూ అయేషా టకియా గ్లింప్స్ కి ఫిదా అయిపోయారు యూత్.ఆ చిత్రంలో అనుష్క పాత్రకు ధీటుగా అయేషా టకియా పాత్ర ఆకట్టుకుంటుంది. కింగ్ నాగార్జునలోని రొమాంటిక్ యాంగిల్ ని గొప్పగా ఆవిష్కరించిన చిత్రమిది. నాగార్జున ప్రేయసిగా - సోనూసూద్ సోదరిగా అయేషా టకియా పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా ఫ్లాపవ్వడంతో అయేషా ఎత్తులు టాలీవుడ్ లో పారలేదు. అటుపై పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. సల్మాన్ సరసన వాంటెడ్ (పోకిరి రీమేక్)లో అయేషా టకియానే కథానాయిక. ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్. ఆ క్రమంలోనే వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది.

కానీ కాలక్రమంలో ఈ అమ్మడికి అందంపై శ్రద్ధ ఎక్కువైపోవడంతో మైఖేల్ జాక్సన్ తీరుగా పదే పదే ముఖాకృతిని మార్చుకునేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం - అవి వికటించడంతో అందం అంతా ఏదో అయ్యిందన్న టాక్ వినిపించింది. దీనిపై బాలీవుడ్ మీడియా పదే పదే రచ్చ చేసిన సంగతి మరువలేం. అయితే ఇదిగో ఇలా ఉన్నట్టుండి ముంబైలో ప్రత్యక్షమై పెద్ద షాకిచ్చింది అయేషా టకియా. సూపర్ సినిమాలో ఎంత స్లిమ్‌గా కనిపించిందో - ఇప్పుడు అంత డ్రమ్ములా మారింది. అసలు ఈ గెటప్ లో అయేషాని గుర్తు పట్టడమే కష్టం. ఏ హాలీవుడ్ బొద్దుగుమ్మో ఇలా దిగిందేమో అని షాక్ తిన్నారంతా. ఓ సెలూన్ కి వచ్చినప్పుడు ఇలా కనిపించి పెద్ద షాకిచ్చింది. వ్వాట్ ద హెల్ ఈజ్ దిస్! అంటూ ఫ్యాన్స్ గిలగిలా కొట్టుకుంటున్నారు. అసలు ఆ దుస్తులు ఏంటి.. మరీ అంత టైట్ గానా? అంటూ కామెంట్లను పోస్ట్ చేశారు. రియల్లీ.. శాడ్! అంతందం ఇలా అయ్యిందేంటబ్బా?