Begin typing your search above and press return to search.

అవార్డుల బిజినెస్ క‌లిసొచ్చేదెంత‌?

By:  Tupaki Desk   |   18 Nov 2018 2:30 PM GMT
అవార్డుల బిజినెస్ క‌లిసొచ్చేదెంత‌?
X
అవార్డులు- స‌న్మానాల్ని బిజినెస్‌ గా మార్చారా.. ధ‌నార్జ‌నే ధ్యేయంగా కొంద‌రికి ఇదో అల‌వాటు వ్యాప‌కంగా మారిందా? అంటే అవున‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌ళాస‌మితుల పేరుతో వీళ్లు ఆడే నాట‌క‌మిద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. క‌ళా స‌మితుల ఉనికి ఒక‌ప్పుడు... ఇప్ప‌డు కాలంతో పాటే మార్పు వ‌చ్చింది. సీజ‌న్‌ కి త‌గ్గట్టే క‌ళాస‌మితులు కాస్తా ఫిలిం ఫెస్టివ‌ల్స్‌ గా మారిపోయాయి. సినిమా పండ‌గ‌ల‌ మాటున ప‌లువురు డ‌బ్బాట ఆడుతున్నారన్న వాద‌న వినిపిస్తోంది. ఫిల్మోత్స‌వాల పేరుతో ఐదు న‌క్ష‌త్రాల హోట‌ళ్ల‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం...ఈ హంగామాను ఎర‌గా చూపించి స్పాన్స‌ర్స్‌ ని ప‌ట్టేయ‌డం.. ల‌క్ష‌లు- కోట్ల‌ల్లో దండుకోవ‌డం ఇటీవ‌ల‌ ప్యాష‌న్‌ గా మారింద‌ని జ‌నాల్లో టాక్ ఉంది.

ఇప్పుడు ప‌లు సంస్థ‌లు చేస్తున్న హ‌డావుడి వెన‌క కార‌ణం ధ‌నార్జ‌నేన‌న్న మాటా వినిపిస్తోంది. ఇటీవ‌ల ఒకాయ‌న‌ తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పి గ‌త మూడేళ్లుగా చిత్రోత్స‌వాలు నిర్వహిస్తూ డ‌బ్బులు దండుకుంటున్నార‌ని ఓ వ‌ర్గం వాదించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఈ నాట‌కం తెలిసిపోయాక మాత్రం స్పాన్స‌ర్లు ఆలోచిస్తున్నార‌ట‌. ఇక‌పోతే ఈ త‌ర‌హా అవార్డులు - ఉత్స‌వాలు పేరుతో స్పాన్స‌ర్ల‌ను ప‌ట్టుకుని ధ‌నార్జ‌న చేసే అవార్డు క‌ర్త‌ల‌పై సీరియ‌స్‌ గా పంచ్‌ లు వేసేవాళ్లు ఉన్నారు. ఇటీవ‌లే ఓ అవార్డు వేడుక‌లో ఓ పెద్దాయ‌న ఏమ‌న్నారంటే.. అవార్డులు ఘ‌నంగా ప్రారంభించి మ‌ధ్య‌లో వ‌దిలేయ‌డం కాదు. ఫ‌లానా స్టార్ పేరుతో దానిని ప్రారంభిస్తే చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగించాలి.. ప‌రువు తీయ‌కూడ‌దని సూచించారు.

ఇదంతా ధ‌నార్జ‌న‌కేనా? అని ప్ర‌శ్నిస్తే ఇందులో రెండో కోణం ఉంది. అవార్డు క‌ర్త‌ల మాట వేరేగా ఉంది. ఇలా అవార్డు కార్య‌క్ర‌మాలు చేయ‌డం వ‌ల్ల చివ‌రికి మిగిలేది పెద్దంత‌గా ఏం ఉండ‌దు. స్పాన్స‌ర్లు ఇచ్చే దాంట్లో మెగా షేర్ సెల‌బ్రిటీల వ‌స‌తులు - ప్ర‌యాణాల ఖ‌ర్చులు - వేదిక ఖ‌ర్చు వగైరా హ‌డావుడి చేసేందుకే అయిపోతోంది. మిగుళ్ల‌ శాతం చాలా చిన్న మొత్త‌మేన‌ని చెబుతున్నారు. అవార్డులు- స‌న్మానాలు లాంటివి కేవ‌లం సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ప‌ర‌ప‌తి పెంచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే ఈవెంట్లేన‌ని కొంద‌రు త‌మ అనుభ‌వాన్ని విశ్లేషిస్తున్నారు. అయినా ఇలాంటి అవార్డ్ ఈవెంట్ల‌ను కేవ‌లం బిజినెస్ గానే చూడాల‌న్న వాద‌నా ఉంది. మ‌రి అవార్డుల వెన‌క పూర్తి నిజాలు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది కొంత‌వ‌ర‌కే.