నేనా? డేటింగ్ గా? లేదులే!!

Thu Apr 20 2017 13:48:27 GMT+0530 (IST)

అవికా గోర్ గుర్తుందా మీకు? చిన్నారి పెళ్లి కుతురగా అందరికి సుపరిచతమే కదా.. దానికితోడు వరస హిట్లు కొట్టి తెలుగులో మరో కొన్నాళ్ళు ఒక హీరోయిన్ గా కెరీర్ సరిపడా పేరు తెచ్చుకుంది ఈ ఉయ్యాలా జంపాల పిల్ల. ఆ తరువాత ఒక కన్నడ.. గుజరాతి సినిమా తో బాగా బిజీ అయింది.

హీరోయిన్ గా మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో ఆదరణ.. కుర్రకారు లో క్రేజ్.. రెండూ సంపాదించింది ఈ పిల్ల. సినిమా చూపిస్తా మావ తో ఇక పర్వలేదు మనకు తెలుగులో అని అనుకున్న తర్వాత వచ్చిన  'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తో కొంచెం  తన స్పీడ్ కి పెద్ద షాక్ తగిలింది. ఆ మధ్య ఒక టాలీవుడ్ చిన్న హీరో తనను ఇబ్బంది పెడుతున్నాడు అని వార్తలోకి వచ్చింది. ఓవర్ గా వెయిట్ పెరిగిపోవడంతో అసలు ఛాన్సులు కూడా తగ్గిపోయాయ్ లే. ఇప్పుడు ఏకంగా ఒక బాలీవుడ్ లో ఒక టీవీ నటుడుతో డేటింగ్ చేస్తుంది అని అక్కడ జనం తెగ ముచ్చట్లు పెడుతున్నారు.

టీవీలో  కో-స్టార్ అయిన మనీష్ రాయ్ కేవలం మంచి ఫ్రెండ్ అని అంతకు మించి ఎక్కవ ఆలోచించకండి అని ప్రెస్ కు గాటుగానే సమధానం ఇచ్చింది అవిక. అయనా అంత పెద్దతనితో నేను డేటింగ్ చేయడం ఏంటి అంటూ ఎదురు ప్రశ్న వేసింది. తెలుగులో అవకాశాలు రావడం లేదా.. తనకు నచ్చటం లేదా తెలియదు కానీ మొత్తం మీద జనాలు మైండ్ లో ఎలోగో ఒకలా ఉంది. మరి మళ్ళి దారి లోకి ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/