Begin typing your search above and press return to search.

బూతు సీన్ల అనుభవం బోలెడుందట

By:  Tupaki Desk   |   25 July 2016 7:30 AM GMT
బూతు సీన్ల అనుభవం బోలెడుందట
X
అష్టాచెమ్మా మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన శ్రీనివాస్ అవసరాల.. బోలెడంత గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత కూడా పలు ఆసక్తికరమైన పాత్రలతో ఆడియన్స్ ను బాగానే మెప్పించాడు. ఇటు డైరెక్టర్ గా కూడా మారిపోయి ట్యాలెంట్ చూపిస్తున్న అవసరాల.. ఇప్పుడో అడల్ట్ కామెడీ మూవీ సినిమా చేసేందుకు ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

బాలీవుడ్ మూవీ హంటర్ ని తెలుగులో రీమేక్ చేస్తుండగా అందులో శ్రీనివాస్ అవసరాల లీడ్ రోల్ చేస్తున్నాడు. ఓ టౌన్ కి చెందిన సెక్స్ అడిక్ట్ కథే ఈ సినిమా. అయితే.. అవసరాల లాంటి గుడ్ బాయ్ ఇమేజ్ ఉన్న కుర్రాడు ఇలాంటి అడల్ట్ మూవీ చేయడం షాక్ ఇచ్చే అంశమే. 'యాక్టింగ్ స్కూల్ లో ఉన్నపుడు చాలా బూతు సీన్లను స్టేజ్ పై లైవ్ లో చేశాను. వాటిని వందలసార్లు రిహార్సల్స్ వేయాల్సొచ్చింది. అలాంటి నాకు ఈ కేరక్టర్ చేయడం పెద్దగా సమస్య కాదు. ఇట్స్ ఓకే' అంటున్నాడు శ్రీనివాస్ అవసరాల. ఈ సినిమా సెకండాఫ్ నచ్చడంతోనే ఈ పాత్ర చేస్తున్నట్లు చెప్పాడు.

హంటర్ రీమేక్ లో మెయిన్ హీరోయిన్ గా రెజీనా.. రాశి ఖన్నాలను అప్రోచ్ అయినట్లు చెప్పిన అవసరాల.. ఇద్దరూ ఇంట్రెస్ట్ చూపించారని తెలిపాడు. హీరోయిన్ ఫైనల్ కాగానే.. సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు నవీన్ సిద్ధమవుతున్నాడు.