కోహ్లిని కామెంట్ చేశాడు.. వాయించేశారు

Wed Sep 13 2017 16:25:29 GMT+0530 (IST)

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి స్థాయి ఏంటో.. అతడి ఫాలోయింగ్ ఏంటో తెలియక ఆస్ట్రేలియాకు చెందిన డెన్నిస్ ఫ్రీడ్ మన్ అనే జర్నలిస్టు అతడి గురించి చీప్ కామెంట్స్ చేసి బుక్కయిపోయాడు. కోహ్లి అభిమానులు డెన్నిస్ ను ఆటాడేసుకున్నారు. అతడిని టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ పెద్ద స్థాయిలో చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లి గతంలో ఒకసారి తన టీమ్ ఇండియా సహచరులతో కలిసి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతను చీపురు పట్టి స్టేడియంలో ఊడ్చాడు. ఇప్పుడు ఈ ఫొటోను షేర్ చేస్తూ.. పాకిస్థాన్ లో వరల్డ్ సిరీస్ మ్యాచ్ కు ముందు స్టేడియాన్ని సిద్ధం చేస్తున్న స్వీపర్లు అని కామెంట్ పెట్టాడు డెన్నిస్.ఈ ట్వీట్ చూసి కోహ్లి అభిమానులకు మండిపోయింది. ఆస్ట్రేలియాతో ఇంకో నాలుగు రోజుల్లో వన్డే సిరీస్ ఆరంభమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక అభిమాని.. ‘‘మీ జట్టును స్వీప్ చేసే ముందు స్టేడియంలో స్వీపింగ్ చేస్తున్నారు’’ అన్నాడు. మరో ఫ్యాన్.. ‘‘ముందు ఈ చెత్తగాడెవడో వీడిని స్వీప్ చేయండి’’ అన్నాడు. ‘‘విరాట్ కోహ్లి ఎంత సంపాదిస్తాడో తెలుసా? అతను కావాలంటే ఓ స్టేడియాన్ని కొనేసి.. నిన్ను స్వీపర్ గా పెట్టి ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ జీతం ఇవ్వగలడు తెలుసా’’ అని మరో అభిమాని డెన్నిస్ గాలి తీసే ప్రయత్నం చేశాడు. ‘‘మా ఇండియన్స్ ఎంత మంచి వాళ్లో ఈ ఫొటోతో తెలియజేసినందుకు థ్యాంక్స్’’ అని ఇంకో అభిమాని అన్నాడు. ఐతే ఇండియన్ సెలబ్రెటీల్ని ఏదో ఒకటి వివాదం చేయడం ద్వారా ట్విట్టర్లో ఫారిన్ జర్నలిస్టులు ప్రయత్నం చేయడం ఇది కొత్తేమీ కాదు. డెన్నిస్ కూడా అలాంటి చీప్ ట్రిక్కే ప్లే చేసినట్లున్నాడు.