Begin typing your search above and press return to search.

సమంత మోనోటనీ వల్ల బోర్‌??

By:  Tupaki Desk   |   31 Aug 2015 7:31 PM GMT
సమంత  మోనోటనీ వల్ల బోర్‌??
X
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. ఒకే నాయికని పదే పదే రిపీట్‌ చేస్తూ రికార్డ్‌ హిట్లు తీస్తున్న మాయావి. అతడు ఇటీవలి కాలంలో ఏ సినిమా తీసినా సమంతనే నాయికగా ఎంచుకుంటున్నాడు. ఇండస్ట్రీ రికార్డ్‌ హిట్‌ అత్తారింటికి దారేది చిత్రంలో సమంత కథానాయికగా నటించింది. ఆ తర్వాత మళ్లీ బన్ని హీరోగా నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తిలోనూ తనే నాయిక. సమంతకు త్రివిక్రమ్‌ ఓ అడిక్షన్‌ అనుకోవాలా? లేక త్రివిక్రమ్‌ కే సమంత ఓ అడిక్షన్‌ అనుకోవాలా?

ఏమో ఇప్పుడు సమంత లేనిదే త్రివిక్రమ్‌ సినిమా తీయలేని పరిస్థితి. తాజాగా నితిన్‌ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలోనూ సమంతనే నాయికగా ఎంచుకున్నాడు. అయితే ఇలా పదే పదే ఒకే నాయికని రిపీట్‌ చేయడం వల్ల ఆడియెన్‌ మోనోటనీ వల్ల బోర్‌ ఫీలయ్యే అవకాశం ఉందన్న విమర్శలొస్తున్నాయి. ఫలానా దర్శకుడికి ఆ ఒక్క హీరోయినే ఆప్షన్‌ అన్న నెగెటివ్‌ టాక్‌ వచ్చేస్తోంది. అయితే త్రివిక్రమ్‌ మనసులో ఆలోచన మాత్రం వేరొక రకంగా ఉంది. ఒకే హీరోయిన్‌ తో మళ్లీ మళ్లీ సినిమాలు తీసి హిట్టు కొట్టి చూపిస్తా. అదే ఛాలెంజ్‌ అంటూ చేయాల్సిందే చేసి చూపిస్తున్నాడు.

సమంత కోసమే రాసుకున్న క్యారెక్టర్‌ లో వేరొక నాయికని మాత్రం తీస్కోవట్లేదు గురువు గారు. త్రివిక్రమ్‌, నితిన్‌ ఎవరికి వారే డామినేటెడ్‌. సమంత ఈ ఇద్దరినీ డామినేట్‌ చేసేలా క్యారెక్టర్‌ రాసుకున్నాడేమో చూడాలి. అయినాసరే ఈ సినిమా వరకు సమంత లైన్ లో వుంటే ఇలాంటి రూమర్లు కామెంట్లు మాత్రం ఆగవు