యంగ్ టైగర్ తో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్

Wed May 16 2018 12:52:57 GMT+0530 (IST)

కోలీవుడ్ లో కొత్త రక్తం తెగ పరిగెడుతోంది. నయా దర్శకులు సెన్సేషన్స్ సృష్టిస్తున్నారు. వీరిలో అట్లీ పేరు కూడా కచ్చితంగా చెప్పుకోవాలి. ఆర్య-నయనతార జోడీగా రాజా రాణి మూవీతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. తర్వాతి కాలంలో రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టేశాడు.విజయ్ తో తెరి.. మెర్సల్ చిత్రాలను సెన్సేషనల్ హిట్స్ గా నిలిపాడు అట్లీ. మెర్సల్ అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాదు.. 200 కోట్ల గ్రాసర్ గా కూడా నిలిచింది. ఈ డైరెక్టర్ తెలుగులో అరంగేట్రానికి కూడా ఉవ్విళ్లూరుతున్నాడు. గతంలోనే టాలీవుడ్ యువ హీరోలతో చర్చలు నిర్వహించాడనే టాక్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నుంచి అట్లీకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే టాక్ ఉంది. రీసెంట్ గా కూడా అట్లీకి తన సమ్మతి తెలియచేశాడట ఎన్టీఆర్. అయితే.. యంగ్ టైగర్-అట్లీ కాంబినేషన్ ఇప్పుడే సాధ్యం కాదనే చెప్పాలి.

ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి మూవీ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే వేరే ప్రాజెక్టులను మొదలుపెట్టగలడు జూనియర్. ఈ కమిట్మెంట్స్ ను పూర్తి చేసే సరికి 2019 ద్వితీయార్ధం వస్తుందని.. రాజమౌళి మూవీ పూర్తయిన తర్వాత.. మొదటగా అట్లీతోనే ఎన్టీఆర్ మూవీ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ తో.. కోలీవుడ్ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ మూవీ అంటే.. ఇండస్ట్రీ జనాల్లో ఇప్పటికే ఆసక్తి జెనరేట్ అవుతోంది.