వీడియో టాక్: ఇలియానా.. అబ్బే.. ప్చ్

Tue Jan 10 2017 14:36:28 GMT+0530 (IST)

ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ లో ఓ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలసిందే. ఆ మధ్యన రుస్తుం సినిమాలో అమ్మడు బాగానే తళుక్కుమనడంతో ఇప్పుడు బాద్షాహో వంటి సినిమాల్లో ఛాన్సు కొట్టేసిందిలే. అయితే ఇవన్నీ కూడా ఈమె ఇమేజ్ ను మాత్రం పెంచడంలేదు.

ఆ మధ్యన బికినీలో అండర్ వాటర్ లో ఎంజాయ్ చేస్తూ.. ఆ టూ పీస్ డ్రస్సులోనే తన అందాలను ఆరబోసిందీ సోయగం. కాని దాని వలన పెద్దగా ఉపయోగం ఏమీ లేకపోయింది. కాకపోతే ఆ సోకులు చూసి టెంప్టయిన కొందరు.. ఇప్పుడు ఒక వీడియో సాంగ్ లో అమ్మడికి చోటిచ్చారు. సింగర్ ఆతిఫ్ అస్లామ్ పాడిన పెహ్లీ దఫా అనే పాట వీడియోలో ఇప్పుడు ఇలియానా ఒక క్యూట్ లవ్వర్ గా కనిపిస్తోంది.  ఓ మూడు రోజుల క్రితం విడుదలైన ఈ పాట గురించి పెద్దగా హైపే లేదంటే చూస్కోండి.. ఇలియానా ఫేం ఏ రేంజులో పడిపోయిందో.  

పాపం స్టార్డమ్ పీక్స్ లో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ర్టీని వదిలేసి వెళిపోయిన ఇలియానా.. ఆ తరువాత నానా తంటాలు పడుతూ.. బాలీవుడ్ లో ఇప్పటికీ ఒక రేంజ్ ఫేం అండ్ ఫామ్ తెచ్చుకోకపోవడం ఆమె దురదృష్టం. అబ్బే.. ప్చ్!!