Begin typing your search above and press return to search.

దాస‌రి ఆరోగ్యం భేష్‌..బెడ్‌ పై నుంచే సినిమా చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   21 March 2017 2:25 PM GMT
దాస‌రి ఆరోగ్యం భేష్‌..బెడ్‌ పై నుంచే సినిమా చ‌ర్చ‌
X
దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌ను ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి పంచుకున్నారు. కొద్దికాలం క్రితం అనారోగ్యానికి గురై కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దాసరిని త‌న స‌న్నిహిత దర్శకుడు కృష్ణారెడ్డితో కలిసి అచ్చిరెడ్డి మంగ‌ళ‌వారం పరామర్శించారు. అనంత‌రం ఫేస్‌ బుక్‌ లో దాస‌రి ఆరోగ్యం - సినీ రంగం గురించి ఆయ‌న‌కు ఉన్న త‌ప‌న గురించి పంచుకున్నారు.

దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితిని అచ్చిరెడ్డి ఫేస్‌ బుక్‌ లో వెల్లడిస్తూ ద‌ర్శ‌క‌ర‌త్న దాదాపు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని వివ‌రించారు. త‌ను రూపొందించబోయే కొత్త సినిమా కథ గురించి స్వయంగా గుర్తు చేసి తెలుసుకున్నారని కృష్ణారెడ్డి వివ‌రించారు. భారీ విజయం సాధించాలని త‌మ‌ను ఆశీర్వదించిన దాస‌రి త‌న గొప్పద‌నాన్ని చాటుకున్నార‌ని అచ్చిరెడ్డి ఫేస్‌ బుక్ పోస్టులో తెలిపారు. ఇలాంటి గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కాబ‌ట్టే తెలుగు సినిమా పరిశ్రమ దాసరి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాద‌ని అచ్చిరెడ్డి త‌న ఫేస్‌ బుక్ పోస్టులో వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/