Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్: అసురుడా.. ర‌క్త పిశాచా?

By:  Tupaki Desk   |   9 Sep 2019 4:06 PM GMT
ట్రైల‌ర్: అసురుడా.. ర‌క్త పిశాచా?
X
ప‌గ‌- ప్ర‌తీకారం నేప‌థ్యంలో ఎన్నో సినిమాలొచ్చాయి. గ్రూపు త‌గాదాలు.. వ‌ర్గ పోరాటాలు సౌత్ సినిమాకి కొత్తేమీ కాదు. ప్ర‌తీకారంతో ర‌గిలిపోతూ చావుకు చావే స‌మాధానం అన్నంత‌గా ర‌గిలిపోయే క‌క్ష‌లు కార్ప‌ణ్యాల క‌థ‌లు అనాదిగా చూస్తున్న‌వే. విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లోనూ ఈ త‌ర‌హా క‌త్తి పోట్లు ఈటెలు విసురుకోవ‌డాలు ప్ర‌తిదీ మ‌న తెర‌కు కొత్తేమీ కాదు. ప‌ల్లెటూరి డ్రామాల్లో వ‌యొలెన్స్ త‌క్కువేమీ కాదు. రెండు వ‌ర్గాలు క‌త్తులు దూసుకుంటే ర‌క్తం ఎలా ఏరులై పారుతుందో ఎన్నో సినిమాల్లో చూపించారు మ‌న మేక‌ర్స్.

తాజాగా ఆ త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు జాతీయ అవార్డు గ్ర‌హీత వేట్రిమార‌న్. త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ అత‌డికి తోడ‌వ్వ‌డంతో ఇంకేం ఉంది? ఇదిగో ఇలా తెర నిండుగా ర‌క్త‌పాతం క‌నిపిస్తోంది. ధ‌నుష్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమా టైటిల్ `అసుర‌న్`. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ర‌క్త‌పిశాచిలా క‌నిపిస్తున్నాడు. పందెంకోడికి అడ్వాన్స్ డ్ వెర్ష‌న్ లా ఉంది. పైగా ధ‌నుష్ కొంచెం కొత్త గెట‌ప్ తో తండ్రి కొడుకుగా ద్విపాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు. త‌ల‌పాగా.. నుదిటిన నామం బొట్లు కోర మీసం.. తీక్ష‌ణ‌మైన చూపులు.. పైగా ష‌రాయి- పంచె క‌ట్టు ఒక‌ గెట‌ప్ అంతా ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అలాగే సాఫ్ట్ గా స్టూడెంట్ లా గ‌ళ్ల చొక్కాతో ఇంకో పాత్ర ర‌క్తి కట్టిస్తోంది.

గ్రామాల్లో దొర‌ల‌కు వీధి చివ‌ర విసిరేసిన బ‌డుగు జ‌నాల‌కు మ‌ధ్య పోరాటంలో ఏం జ‌రిగింది? అనే క‌థ‌తో వేట్రిమార‌న్ కాస్తంత 70-80ల నాటి క‌థ‌తోనే సెట్స్ కెళ్లార‌ని అర్థ‌మ‌వుతోంది. సాహిత్య అకాడెమీ పుర‌స్కారం అందుకున్న పూమ‌ణి ర‌చ‌న వెక్కై ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఎమోష‌న్ యాక్ష‌న్ హైటైట్ గా క‌నిపిస్తున్నాయి. పొల్లాద‌వ‌న్- ఆడుగ‌లం- వడ చెన్నై లాంటి కల్ట్ సినిమాల త‌ర్వాత ధ‌నుష్- వెట్రిమారన్ జోడీ ఇంట్రెస్టింగ్ ఎటెంప్ట్ ఇద‌ని చెప్పొచ్చు. మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ ఈ చిత్రంలో క‌థానాయి. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారి. దసరా కానుకగా అక్టోబరు 4న సినిమా రిలీజ్ కానుంది.