Begin typing your search above and press return to search.

బాహుబలిని కొన్నాక ఖైదీని కూడా..

By:  Tupaki Desk   |   28 Oct 2016 3:30 PM GMT
బాహుబలిని కొన్నాక ఖైదీని కూడా..
X
సాధారణగా ఒక ఏరియా డిస్ర్టిబ్యూటర్ ఒక పెద్ద సినిమాపై ఇన్వెస్టుమెంట్ పెట్టేసిన తరువాత.. ఆ సినిమా రికవర్ చేసేవరకు వెయిట్ చేస్తుంటారు. కాని ఈ మధ్యన కొందరు మాత్రం కార్పొరేట్ స్టయిల్లో వరుసపెట్టి పెద్ద పెద్ద సినిమాలను కొనేస్తున్నారు. అదిగో ఇప్పుడు బాహుబలి 2 సినిమా రైట్స్ కొన్న పంపిణీదారుల పరిస్థితి కూడా అలాగే ఉంది.

దాదాపు 55 కోట్లను పెట్టి బాహుబలి 2 నైజాం ఏరియా రైట్స్ కొన్నారు ఏషియన్ మూవీస్ అనే సంస్థకు చెందినవారు. ఇప్పుడు అదే సంస్థ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ''ఖైదీ నెం 150'' ధియేట్రికల్ రైట్స్ బిజినెస్ దాదాపు 83+ కోట్లను టచ్ అయ్యిందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇందులో నైజాం ఏరియాకు గాను.. 21 కోట్లు పేమెంట్ చెల్లించారట సదరు ఏషియన్ మూవీస్ వారు. బాహుబలి వంటి పెద్ద సినిమాను కొన్నాక.. ఖైదీని కూడా తమ చేతిలోనే పెట్టుకుంటారా అనే సందేహం చాలామందికి వచ్చే ఉండొచ్చు. కాని వీరు చాలా డేరింగ్ గా ఖైదీ గురించి కూడా లెక్కలు పక్కాగా వేసుకున్నట్లున్నారు.

అయితే ఈ రెండు సినిమాల్లో ముందు చిరంజీవి ఖైదీ నెం150 రిలీజవుతుంది కాబట్టి.. మొదటగా పంపిణీదారులకు వరాలను కురిపించే ఆ అవకాశం మెగాస్టార్ కే ఉంది మరి. చూద్దాం ఆయనేం చేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/