చిరు - ఎన్టీఆర్ - దేవరకొండ ఇదీ లైనప్!

Tue Sep 18 2018 20:45:36 GMT+0530 (IST)

వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ ఇప్పటికి కెరీర్‌లో 52 సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్‌లో మరో 50 సినిమాలు నిర్మిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు వరుసగా యువదర్శకులతో భారీ చిత్రాల్ని ప్లాన్ చేశామని వెల్లడించారు.దత్ మాట్లాడుతూ -``దర్శకుడు నాగితో ఓ భారీ సినిమా తీస్తున్నాం. ఈ కథ ఒక స్టేజ్ లో చిరంజీవికి సెట్ అవుతుందనిపించింది. కథ కంప్లీట్ అయ్యాకే నాగి హీరో ఎవరనేది తెలుస్తుంది. మెర్సల్ ఫేం అట్లీ తో జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ తో ఒక సినిమా విజయ్ దేవరకొండతో 2 సినిమాలు చేస్తాం. విజయ్ దేవరకొండ మూవీ రాజ్ - డీకే  దర్శకత్వంలో ఉంటుంది`` అని తెలిపారు.

వైజయంతిలో నటవారసుల్ని పరిచయం చేయడంపై ప్రస్థావిస్తూ.. ``మహేష్ బాబుని మా బ్యానర్ లో లాంచ్ చేయగలగడం కృష్ణ గారికి నాపై ఉన్న నమ్మకం. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ బ్యానర్ లోనే లాంచ్ చేసుకోవచ్చు కానీ ఆ అవకాశం నాకిచ్చారు యన్‌టీఆర్- స్టూడెంట్ నం 1 రామ్ చరణ్- చిరుత బన్ని -గంగోత్రి.. ఇవన్నీ వాళ్ళు చేసుకోలేక కాదు అనుభవం ఉన్న నిర్మాతగా వాళ్ళు నన్ను నమ్మి అవకాశమిచ్చారు. అది నా గొప్పతనం కాదు… మాకున్న అండర్ స్టాండింగ్ అలాంటిది. నారా రోహిత్ ని పరిచయం చేసిన ‘బాణం’ సినిమా చాలా మంచి ప్రయత్నం. మంచి అవార్డులు వచ్చాయి`` అని తెలిపారు.  ఆ తరం నటీనటులతో మొదలైన వైజయంతీ సంస్థలో అలనాటి నటి సావిత్రి కథ చెప్పగలగడం ప్రతిష్ఠాత్మకంగా ఫీలయ్యాం. అది ఇంత అద్భుతంగా సక్సెస్ అవ్వడం ఘనకీర్తిని తెచ్చిపెట్టడం గర్వ ంగా భావించామని అన్నారు. మొత్తానికి దత్ చిరంజీవితో ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేసినా అదెందుకో కుదరలేదని అర్థమవుతోంది. అట్లీతో మాత్రం భారీ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.