Begin typing your search above and press return to search.

ఆ బ్యానర్ లో నాని అండ్ నాగ్ కనిపిస్తారు

By:  Tupaki Desk   |   19 Oct 2017 9:10 AM GMT
ఆ బ్యానర్ లో నాని అండ్ నాగ్ కనిపిస్తారు
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి తన మల్టి స్టారర్ సినిమాను చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇదివరకే చాలా ప్రెస్ మీట్స్ లలో నానితో ఒక సినిమాను చేయడానికి డిసైడ్ అయినట్లు ఈ సీనియర్ హీరో చెప్పాడు. బలే మంచి రోజు సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య ఆ తర్వాత శమంతకమణి అనే మినీ మల్టి స్టారర్ ని తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు నాగార్జున - నానితో కలిసి మరో భారీ మల్టి స్టారర్ ని తీయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం నాని రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమా అయిపోగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. నాని ఇప్పటికే వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. నాగ్ కూడా ప్రయోగాత్మకమైన సినిమాలను తీయడానికి రెడీ అవుతారు. ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెరకెక్కించడానికి రెడీ అయ్యింది. ఈ మధ్య కాలంలో సినిమా నిర్మాణంలో స్లో అయిన అశ్విని దత్.. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే అవన్నీ ఆయన కూతురు స్వప్న చూసుకుంటుంటే.. ఈయన దిల్ రాజుతో కలసి వంశీ పైడిపల్లి డైరక్షన్లో మహేష్‌ బాబు సినిమా తీస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమాను డైరక్టుగా చేస్తారట.