Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ హౌస్ నుంచి అషు ఔట్...

By:  Tupaki Desk   |   26 Aug 2019 4:31 AM GMT
బిగ్‌ బాస్ హౌస్ నుంచి అషు ఔట్...
X
గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ ఐదో వారం కూడా కొనసాగింది. ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ షో నుంచి అషు రెడ్డి బయటకెళ్లింది. మొదటి వారం హేమ - రెండో వారం జాఫర్ - మూడో వారం తమన్నా - నాలుగో వారం రోహిణిలు ఇంటి నుంచి బయటకెళ్లిన విషయం తెల్సిందే. ఇక ఐదో వారం నామినేషన్స్ లో మహేశ్ - శివజ్యోతి - బాబా భాస్కర్ - పునర్నవి - రాహుల్ - హిమజ - అషులు ఉన్నారు. ఇందులో శనివారం ఎపిసోడ్ లో మహేశ్ - శివ జ్యోతిలు సేఫ్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

దీంతో ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఇంటికి బయటకు వెళతారని టెన్షన్ నెలకొంది. ఆ టెన్షన్ కొనసాగిస్తూ నాగ్ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ మధ్య మధ్యలో సేఫ్ అయిన వారి పేర్లని చెప్పారు. ఈ క్రమంలో ముందు బాబా భాస్కర్ సేఫ్ అయ్యాడని చెప్పారు. ఆ తర్వాత పునర్నవి - రాహుల్ ని సేఫ్ చేశారు. చివరికి హిమజ - అషు రెడ్డి మిగిలారు. వీరిలో అషు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగార్జున - హిమజ సేఫ్ అయినట్లు చెప్పారు. ఇక అషు వెళ్ళేటప్పుడు శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టేసింది. ఆమెని ఓదార్చి - హౌస్ మేట్స్ అందరికీ బై చెప్పేసి అషు బయటకొచ్చేసింది.

ఇక బయటకొచ్చిన అషురెడ్డితో నాగార్జున ఓ గేమ్ ఆడించారు. ఆమె ముందు ప్రస్తుతం హౌస్‌ లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలన్నీ ఉంచి.. హౌస్‌ లో ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నావో ఆ ఫొటోలు ఉంచి మిగిలినవి పగలగొట్టమని నాగార్జున సూచించారు. దీంతో అషు...మహేష్ - రాహుల్ - వితికా - హిమజ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదని కారణాలు చెబుతూ వారి ఫొటోలను పగలగొట్టింది. ఇక శివజ్యోతి - శ్రీముఖి - పునర్నవి - బాబా భాస్కర్ - అలీ రెజా - రవికృష్ణ - వరుణ్ సందేశ్‌ లు ఇంట్లో ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పింది.