Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అక్కాతమ్ముళ్ళు అదిరే

By:  Tupaki Desk   |   28 May 2017 12:08 PM GMT
ఫోటో స్టోరి: అక్కాతమ్ముళ్ళు అదిరే
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇప్పుడు తన కెరీర్ తోను తన ఫ్యామిలి తోను చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి ఉన్న ముచ్చటైన కుటంబం చూసి అందరూ చాలా బాగా మాట్లాడుకోవడం మనం వింటున్నాం. ఇక కింగ్ ఖాన్ జీవితంలోకి అబ్ రామ్ ఖాన్ వచ్చినప్పటి నుండి షారుక్ పిల్లలు మీడియాలో ఒక సెంటర్ పాయింట్ అయ్యారు. అబ్ రామ్ పుట్టినప్పటి నుండే స్టార్ అయిపోయాడు.

ఇకపోతే ఆర్యన్ ఖాన్ - సుహానా ఖాన్ ప్రపంచానికి ముందే తెలిసినా.. అబ్రామ్ ఖాన్ వచ్చిన తరువాత ఇంకా వీరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు జనాలు. ఆ బుడ్డోడితో ముద్దుగా పెద్ద పిల్లలు దిగుతున్న ఫోటోలు చేసే సంచలనం మనం సోషల్ మీడియాలో చూడవలిసిందే. క్రికెట్ గ్రౌండ్ లోనైనా, ఇంటర్వ్యూలో అలా వచ్చి కనపడినా.. ఆ ఫోటోలకు షేర్లు, క్లిక్లు లైక్లు ముద్దుల వర్షం వచ్చి పడవలిసిందే. ఇక్కడ కూడా కింగ్ ఖాన్ గారాల కొడుకు తన అక్క పై వాలి తృప్తిగా స్వాంతన చెందుతున్నాడు. ఇంత వరుకు అబ్రామ్ ఖాన్ ఉన్న ప్రతి ఫోటోలో పిల్లాడు మాత్రమే ప్రముఖంగా కనిపించేవాడు. ఇప్పుడు ఈ ఫొటోలో తన అక్కకు ఆ అవకాశం ఇచ్చినట్లు ఉన్నాడు. అందుకే సుహాన్ అండ్ అబ్ రామ్ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆర్యన్ హీరో ఎప్పుడు అవుతాడో కానీ.. సుహానా ఖాన్ మాత్రం నేను నటిని అవుతాను అని ఇప్పటికే తన నాన్న ద్వారా ప్రకటన ఇచ్చేసింది. స్టార్ కిడ్స్ లో సూపర్ స్టార్ కిడ్స్ వీళ్ళు. వీళ్ళని ఎవ్వరులే స్టార్స్ కాకుండా ఆపేది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/