ప్రెసిడెంట్ గారి టోకెన్ నంబర్ వచ్చింది

Sun Apr 15 2018 11:33:38 GMT+0530 (IST)

సంచలనాల మీద సంచలనాలు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఇప్పుడు ఏ సంచలనం ఎప్పుడు తెర మీదకు వస్తుందో అర్థం కాక కిందా మీదా పడిపోతున్న పరిస్థితి. క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ మొదలై.. ఒక్కొక్కరిగా తెర మీదకు వస్తున్న వేళ.. శ్రీరెడ్డి ఎంట్రీ తెలుగు చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో ఆమె పైచేయి స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. సరికొత్త అంశాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి.తాజాగా మరో సంచలనం తెర మీదకు వచ్చింది. శ్రీరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయంపై పెదవి విప్పుతున్నారు. తాజాగా శృతి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు జరిగిన అన్యాయాల్ని ఏకరువు పెట్టింది. సంచలన ఆరోపణలు చేసింది.

ఒక టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మా అసోసియేషన్లో కూడా లైంగికంగా వేధించేవాళ్లు ఉన్నారని.. మా పెద్దలు కూడా అందులో భాగస్వాములేనని ఆమె వ్యాఖ్యానించారు. అందరూ దొరలేనని.. దొరికితే మాత్రమే దొంగలే అంటూ తీవ్ర ఆరోపణ చేశారు.

శృతి చేసిన ఆరోపణపై శ్రీరెడ్డి స్పందించారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీరాజామా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ది గ్రేట్ మా ప్రెసిడెంట్ శివాజీ రాజాగారు మీ టోకెన్ నంబరు వచ్చిందండి.. పది మందికి న్యాయం చేయాల్సిన పదవిలో ఉండి ఏంటండి మీ రాసలీలలు. మీరు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి.. మా ప్రెసిడెంట్ పదవికి మీరు అనర్హులు అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకూ ప్రముఖుల పేర్లు మాట్లాడని శ్రీరెడ్డి.. ఇప్పుడు నేరుగా మాట్లాడేయటం.. సవాలు విసరటం వాతావరణం మరింత వేడెక్కిపోయేలా చేయటమే కాదు.. ఈ వ్యవహారం మరింత కాలం కొనసాగనున్న వైనాన్ని చెప్పేసిందని చెప్పక తప్పదు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి