Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ పిల్లకు ప్రభాస్ తో ఛాన్స్

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:54 PM GMT
బిగ్ బాస్ పిల్లకు ప్రభాస్ తో ఛాన్స్
X
అదేదో సినిమాలో చెప్పినట్టు అదృష్టం ఒకోసారి జలుబు పట్టేసినట్టు అంటుకుంటుంది కొందరిని. అదే జాబితాలో ఉంది అర్షి ఖాన్. ప్రస్తుతం వివాదాస్పద బిగ్ బాస్ షో ఫైనల్ లెవెల్ పార్టిసిపెంట్ గా ఉన్న అర్షి ఖాన్ కు ప్రభాస్ తో నటించే అవకాశం దక్కిందట. ఇది తనే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. ఆ మెసేజ్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కు సైన్ చేసానని అందులో బాహుబలి ప్రభాస్ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని తన ఫాన్స్ తో చెప్పిన ఆర్ష సినిమా డీటెయిల్స్ మాత్రం బయట పెట్టలేదు. సాహో ప్రోగ్రెస్ లో ఉంది కనక అది కాదు. దీని తర్వాత గోపీచంద్ తో జిల్ తీసిన దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ చేసే అవకాశాల గురించి ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. అది ఫైనల్ కాలేదు కాని స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం.

మరోపక్క సాహో అయ్యాక తాను బాలీవుడ్ మూవీ చేస్తున్నాను అని క్లూ ఇచ్చిన ప్రభాస్ అది నిజంగానే చేసే అవకాశాల గురించి కూడా జోరుగా చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన ఏ చిన్న సమాచారం కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది సినిమా యూనిట్. అర్షి ఖాన్ ఒప్పుకుంది రాధా కృష్ణ సినిమానా లేక ప్రభాస్ డెబ్యు హింది మూవీనా అనే క్లారిటీ మాత్రం ప్రస్తుతానికి లేదు. సౌత్ ఇండియన్ సినిమాల్లో చేయటం గురించి ముందు నుంచి ఆసక్తి ఉన్న అర్షి ఖాన్ కల దీనితో నెరవేరినట్టే. బిగ్ షో షో సీజన్ 11 పుణ్యమా అని అర్షి ఖాన్ కు మంచి పాపులారిటీ దక్కింది. కాని ప్రభాస్ సినిమాలో తనకు దక్కింది హీరొయిన్ ఆఫరా లేక ఇంకేదైనా పాత్రనా అనేది చెప్పి ఉంటే బాగుండేది.