Begin typing your search above and press return to search.

రోబో 2 విల‌న్ గా హాలీవుడ్ స్టార్‌?

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:30 PM GMT
రోబో 2  విల‌న్ గా హాలీవుడ్ స్టార్‌?
X
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రోబో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు శంక‌ర్ రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ - న‌టీన‌టుల ఎంపిక చేస్తున్నారు. అయితే ఇలాంటి సైన్స్ ఫిక్ష‌న్ ఫిలింలో విల‌న్‌ గా ఎవ‌రు న‌టిస్తే బావుంటుంది? ర‌జ‌నీకి ధీటైన విల‌నీ చేసే ద‌మ్మున్న యాక్ట‌ర్ ఎవ‌రున్నారు? అన్న విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రంలో క‌మ‌ల్‌ హాస‌న్ లేదా విక్ర‌మ్ విల‌న్ క్యారెక్ట‌ర్‌ లో న‌టిస్తార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఏ ఒక్క‌రూ ఇంకా క‌న్ఫ‌మ్ కాలేదు. స‌రిగ్గా ఇలాంటి టైమ్‌ లోనే మ‌రో హాట్ న్యూస్ కోలీవుడ్‌ ని ప‌ట్టి కుదిపేస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్ష‌న్ హీరో ఆర్నాల్డ్ స్వాజ్‌ నెగ్గ‌ర్ విల‌న్‌ గా న‌టిస్తార‌న్న‌దే ఆ హాట్ న్యూస్‌. ఇప్ప‌టికే శంక‌ర్ ఆర్నాల్డ్‌ ని సంప్ర‌దించారు. అయితే ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నారు. ఆర్నాల్డ్ ఇంకా ప్రాజెక్టుకి సంత‌కం చేసిందేం లేదు.. కానీ అత‌డు న‌టించ‌డానికి ఆస్కారం ఉంద‌ని చెప్పుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టును అంత‌ర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలంటే క‌చ్ఛితంగా ప్రాజెక్టులోకి ఆర్నాల్డ్ రావాల్సిందేన‌ని శంక‌ర్ భావిస్తున్న‌ర‌ట‌. అయితే ఈ చిత్ర‌యూనిట్ అధికారికంగా ఈ విష‌యాన్ని ధృవీక‌రించాల్సి ఉంది.