Begin typing your search above and press return to search.

రామూని ఇంటర్వ్యూ చేసే సత్తా అతనికే వుంది

By:  Tupaki Desk   |   28 Nov 2015 1:30 AM GMT
రామూని ఇంటర్వ్యూ చేసే సత్తా అతనికే వుంది
X
తన పేరుమీద హైదరాబాద్ లో కనిపెట్టిన కొత్త డ్రింక్ (రమ్ - జిన్ - వోడ్కా - ఆర్.జి.వి)ని టేస్ట్ చేస్తూ, దాన్ని కే.సి.ఆర్ కి అంకితమిస్తూ రామ్ గోపాల్ వర్మ మంచి ఉత్సాహంలో వున్నాడు. ఇటీవల అమీర్ ఖాన్ వ్యవహారంపై సంచలన ట్వీట్ లు చేసిన వర్మగారు గత రెండు మూడు రోజులుగా సైలెంట్ గా వుండడం విశేషమే అయినా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రామూ మరో సంచలనానికి దారి గీస్తున్నాడు.

రామూకి మీడియాకి అంతగా పడదు. వాళ్ళు సూటిగా అడిగే ప్రశ్నలకు రామూ పదునైన జవాబులు అగ్నికి ఆజ్యం పోస్తాయి. టి.వి 9 రవి ప్రకాష్ - యండమూరి వీరెంద్రనాద్ ఆఖరికి తనను తానే ఇంటర్వ్యూ చేసుకున్నా సరే రామూనే గెలిచిన సందర్భాలు ఎక్కువ. అయితే ఇప్పుడు భారతదేశ మీడియా రంగంలో పాపులర్ అయిన అర్నబ్ గోస్వామి తో రామూ ఇంటర్వ్యూ వుంటుందని సమాచారం. వీరిద్దరిలో ఏ ఒక్కరూ తగ్గే రకం కాదు గాబట్టి వీరి మధ్య మాటల యుద్ధం అత్యంత ఆసక్తికరంగా వుంటుందని అందరి ఆశ. చూద్దాం. ఈ వార్త ఎప్పటికి నిజమవుతుందో..