నేను బాగానే ఉన్నా -అర్జున్ రెడ్డి హీరోయిన్

Wed Sep 13 2017 14:16:24 GMT+0530 (IST)

గత కొన్ని రోజులుగా అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన్ శాలిని పాండే చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఆమెకు సరైన నిద్ర మరియు విశ్రాంతి లభిస్తుందో లేదో తెలియదు కాని.. రోజూ షాపు ఓపెనింగులూ అవీ ఇవీ అంటూ చాలా ఊళ్ళు తిరిగేస్తోంది. ఈరోజు ఉదయం నెల్లూరులోని ఒక షాపును ఓపెన్ చేయడానికి వెళ్తున్నట్లు అమ్మడు తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది.ఆ తరువాత నెల్లూరులో సెల్ పాయింట్ ను ప్రారంభించడానికి వెళ్లిన శాలిని.. అక్కడ అస్వస్థతకు గురైంది. దానితో ఆమెను దగ్గర్లోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు గంటపాటు చికిత్స అందించి.. అంతా ఓకె అని చెప్పారట. కాని షాకింగ్ అంశం ఏంటంటే.. ఆమెను స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో.. ఆమె బాడీ అంతా ఒక వైట్ క్లాత్ తో కప్పేసి.. అలాగే ముఖాన్ని కూడా  ఒక వైట్ క్లాత్ తో కప్పేశారు. ఆమెకు ఏమైందో అని అందరూ కంగారు పడుతుంటే.. సదరు హాస్పిటల్లో పేషెంట్లు మాత్రం.. హీరోయిన్ వచ్చిందనే విషయం తెలియగానే వారి బంధువులతో సహా ఆమెతో ఫొటోలు తీసుకొనేందుకు ప్రయత్నించారు.

కట్ చేస్తే.. నాకేం అవ్వలేదు.. నేను బాగానే ఉంటాను.. అంటూ అమ్మడు ఫేస్ బుక్ లో ఒక లైవ్ వీడియోనే పెట్టింది. చక్కగా ఫుల్లు మేకప్ లో ఉండీ హ్యాపీగా మాట్టాడింది శాలిని పాండే. ఇంతకీ అసలు ఏమైనట్లు?