కూతురు హీరోయిన్ కాబోతుంటే మళ్ళీ తండ్రి కాబోతున్నాడు

Wed Apr 24 2019 14:42:19 GMT+0530 (IST)

ఈమద్య కాలంలో సహజీవనం చాలా కామన్ అయ్యింది. ముఖ్యంగా సినీ ప్రముఖులు సహజీవనం చేయడం పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడి కలిసి ఉండటం పిల్లలను కూడా కనడం చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పద్దతి మెల్ల మెల్లగా మన దేశంలో కూడా మొదలైంది. సహజీవనం చేసిన చేస్తున్న ఇండియన్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఒకడు హిందీ హీరో అర్జున్ రాంపాల్. ఇతడు గత సంవత్సరం భార్యకు విడాకులు ఇచ్చాడు. 22 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టిన అర్జున్ రాంపాల్ ఆ వెంటనే సౌత్ ఆఫ్రికా బ్యూటీ గాబ్రియాలాతో సహజీవనం సాగించడం మొదలు పెట్టాడు.గాబ్రియాలా కోసమే భార్యకు రాంపాల్ విడాకులు ఇచ్చాడనే టాక్ కూడా ఉంది. గత ఏడాది కాలంగా సహజీవనం సాగిస్తున్న అర్జున్ రాంపాల్ మరియు గాబ్రియాలాలు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశాడు. గాబ్రియాలా గర్బంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లుగా ప్రకటించాడు.

45 ఏళ్ల అర్జున్ రాంపాల్ మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో పెద్ద అమ్మాయి త్వరలో బాలీవుడ్ తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఒక సినిమా కూడా మొదలై షూటింగ్ జరుపుకుంటుంది. కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సమయంలో అర్జున్ రాంపాల్ మరోసారి తండ్రి కాబోతుండటం విడ్డూరంగా అనిపించినా ఇలాంటివి బాలీవుడ్ లో చాలా కామన్ గా కనిపించే సంఘటనలు.