Begin typing your search above and press return to search.

కుర్ర హీరో మందు ఖర్చు రోజుకి లక్ష

By:  Tupaki Desk   |   30 Aug 2016 7:30 PM GMT
కుర్ర హీరో మందు ఖర్చు రోజుకి లక్ష
X
ఒక సినిమా స్టార్ట్ చేసే ముందే.. దాని ఫినిషింగ్ వరకూ ప్లానింగ్ చేసేసుకుంటారు దర్శక నిర్మాతలు. అంత పక్కాగా ప్లాన్ చేసుకుంటేనే.. అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడం కష్టం. అలాంటిది ఏకంగా హీరో పాత్రధారే తాగి తూలుతూ నానా హంగామా చేసేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు షూటింగ్ కంప్లీట్ అవుతుందా?

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కారణంగా.. ఓ సినిమా పరిస్థితి ఇలాగే అయింది. ప్రస్తుతం ఈ కుర్రాడు హాఫ్ గాళ్ ఫ్రెండ్ అనే మూవీలో నటిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అర్జున్ కపూర్ హంగామా మామూలుగా ఉండడం లేదట. రాత్రయితే చాలు.. ఫ్రెండ్స్ ని వెంట బెట్టుకుని పార్టీల్లో మునిగి తేలుతున్నాడట. అంతే కాదు.. ఇతగాడి పార్టీ ఖర్చు రోజుకు కనీసం లక్ష పైగానే ఉంటోందని టాక్.

తాగితే తాగాడు అనుకుందామంటే.. మధ్యాహ్నం గాని షూటింగ్ కి రాకుండా.. హాఫ్ గాళ్ ఫ్రెండ్ డైరెక్టర్ ని విసిగించేస్తున్నాడట. అప్పుడు కూడా మందు మత్తుతో పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని టాక్. దీంతో ఈ విషయాన్ని అర్జున్ కపూర్ తండ్రి బోనీకపూర్ దగ్గరకు తీసుకెళ్లగా.. అతగాడు హీరో-డైరెక్టర్ ఇద్దరినీ సమన్వయపరిచాడని తెలుస్తోంది. ఇప్పటికైతే కుర్రాడు బుద్ధిగానే పని చేస్తున్నాడట. ఇదే స్పీడ్ లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి ఒడ్డున పడాలని దర్శకుడు మోహిత్ సూరి స్పీడ్ పెంచాడని తెలుస్తోంది.