Begin typing your search above and press return to search.

ఆ హీరో రెడ్ హ్యాండెడ్‌ గా దొరికేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   5 May 2016 9:32 AM GMT
ఆ హీరో రెడ్ హ్యాండెడ్‌ గా దొరికేశాడ‌ట‌
X
బాలీవుడ్‌ లో ప్రేమాయ‌ణాలు భ‌లే గ‌మ్మ‌త్తుగా వుంటాయి. ఎవ‌రు ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు ఒక్క‌ట‌వుతారో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ రోజు ఫ‌లానావాళ్లు ప్రేమికులంట అని చెప్పుకొంటారు. మ‌రుస‌టి రోజు... కాదు కాదు ఆ ఇద్ద‌రూ విడిపోయి ఫ‌లానా ఇద్ద‌రితో క‌లిసిపోయార‌ట అని వార్త‌లొస్తుంటాయి. ఇదివ‌ర‌కు సినిమాలో న‌టించే హీరో హీరోయిన్ల మధ్యే ఎక్కువ‌గా ల‌వ్‌ స్టోరీలు న‌డిచేవి.

ఇప్పుడు సినిమాల‌తో సంబంధం లేకుండా రిలేషన్స్ చిగురిస్తున్నాయి. మ‌లైకా ఆరోరాలాంటి సీనియ‌ర్ న‌టితో - అర్జున్‌ క‌పూర్‌ లాంటి కుర్ర హీరో ప్రేమాయ‌ణం సాగిస్తాడ‌ని ఎవ‌రైనా ఊహిస్తారా? బిపాసా లాంటి సీనియ‌ర్ హీరోయిన్ క‌ర‌ణ్‌ సింగ్ గ్రోవ‌ర్‌ లాంటి న‌యా హీరోని పెళ్లి చేసుకొంటుంద‌ని ఎవ‌రైనా క‌ల‌గ‌న్నారా కానీ అవ‌న్నీ నిజ‌మ‌వుతున్నాయి. అర్జున్ క‌పూర్ హీరోగా ఇప్పుడిప్పుడే దూసుకెళ్తున్నాడు. త‌న‌లాగే ఏ కుర్ర‌భామ‌తోనే ప్రేమ‌లో ప‌డ్డాడంటే అందులో ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందేమీ లేదు.

కానీ ఏకంగా పెళ్లి చేసుకొన్న మ‌లైకా మాయ‌లో ఆయ‌న ప‌డిపోయాడు. స‌ల్మాన్‌ ఖాన్ త‌మ్ముడైన అర్బాజ్‌ ఖాన్ భార్య మ‌లైకా. వీరిద్ద‌రూ కొంత‌కాలంగా వేర్వేరుగా వుంటున్నారు. మ‌లైకానే అర్బాజ్‌ ని దూరం చేసుకొంద‌ట‌. అందుకు కార‌ణం అర్జున్ క‌పూర్ ప్రేమ‌లో ప‌డ‌ట‌మే అని తెలిసింది. కానీ త‌న త‌మ్ముడు - మ‌లైకాని క‌ల‌పాల‌ని స‌ల్మాన్‌ ఖాన్ కూడా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడ‌ట‌. కానీ మ‌లైకా మాత్రం స‌సేమిరా అందట‌. దీంతో ఎవ‌రి దారి వారు చూసుకొన్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే అర్జున్‌ - మ‌లైకాలు మాత్రం ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌కుండా సీక్రెట్‌ గా క‌లుసుకొంటున్నార‌ట‌.

ఆ విష‌యాన్ని ఎలాగైనా బ‌య‌ట‌పెట్టాల‌నుకున్న బాలీవుడ్ మీడియాకి అర్జున్ క‌పూర్ రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిన‌ట్టు స‌మాచారం. మ‌లైకా ఫ్లాట్‌ కి అర్జున్ క‌పూర్ అర్ధ‌రాత్రి వెళ్లాడ‌ట‌. అది చూసి కెమెరాల‌కి ప‌నిపెడ‌దామ‌నుకొనే లోపే ఆయ‌న మాయ‌మైపోయాడ‌ట‌. కానీ మ‌లైకా ఇంట్లోకి వెళ్లాక అక్క‌డ్నుంచే పోలీసుల‌కి ఫోన్ చేసి బ‌య‌ట వున్న మీడియాని పంపేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఆ విష‌యం గురించి బాలీవుడ్ వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకుంటున్నాయి. వ‌య‌సులో చాలా తేడా వున్న ఈ ఇద్దరి మ‌ధ్య బంధం ఎన్నాళ్లు కొన‌సాగుతుందో చూడాలి మ‌రి!