ఆవిడ కుమారుడికి ఈయన గార్డా?

Mon Feb 18 2019 15:47:07 GMT+0530 (IST)

వయసుతో పనేం లేదు.. మనసుండాలే గానీ! అని నిరూపిస్తున్నారు ఆ హాట్ కపుల్. ఎవరు ఏమనుకున్నా తాము చేసేది చేసి తీరతామని ఆర్జీవీలా మొండిగానే ముందుకు సాగుతున్నారు. పబ్లిక్ అప్పియరెన్స్ విషయంలో కానీ మీడియా ముందు కనిపించే విషయంలో కానీ ఎక్కడా దాపరికం లేదు. నిప్పు లేనిదే పొగ రాదు! అన్న సామెతకు వీళ్లు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంతకీ ఈ జంట ఎవరు? అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. బాలీవుడ్ హాట్ కపుల్ మలైకా అరోరాఖాన్ - అర్జున్ కపూర్ జంట గురించే ఇదంతా.ఇప్పటికే విడాకులు ఇచ్చిన మలైకాతో చెట్టాపట్టాల్ అంటూ తిరిగేస్తున్న అర్జున్ కపూర్ తమ మధ్య బాంధవ్యాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడని తొందర్లోనే పెళ్లికి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. అందుకు సూచికగా మలైకా ఎక్కడికి వెళ్లినా అక్కడ అర్జున్ కనిపిస్తున్నాడు. పార్టీలు పబ్లులు క్లబ్బులు రెస్టారెంట్లు .. సందర్భం ఏదైనా అక్కడ ఈ జంట వాలిపోతున్నారు. ఫేజ్ 3 ప్రపంచంలో వీళ్లకు ఓ గ్యాంగ్ మద్ధతు కూడా ఉంది. పైగా అర్జున్ తరపున బాబాయ్ అనీల్ కపూర్ .. సోదరి సోనమ్ కపూర్ ల సపోర్టు ఉందన్న ప్రచారం ఉంది. అయితే అతడి రిలేషన్ షిప్ విషయంలో ఆర్భాజ్ సోదరుడు సల్మాన్ కోపంగా ఉన్నాడని  డాడ్ బోనీ కపూర్ సీరియస్ అయ్యాడని మరోవైపు ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం వల్లనో ఏమో.. ఆ ఇద్దరూ మొన్న వేలెంటైన్స్ డే విషయంలో ఎలాంటి హడావుడి చేయకుండా సైలెంటుగా ఉన్నారు. ఈ సైలెన్స్ ను భరించలేని బాలీవుడ్ మీడియా మరోసారి వేడెక్కించేందుకు ఆ ఇద్దరి మధ్యా బ్రేకప్!! అంటూ కథనాలు అల్లేయడం ఆసక్తి రేకెత్తించింది.

వర్తమానంలో ఆ బ్రేకప్ వార్తలు అసత్యమని తేల్చేస్తూ .. మరోసారి మలైకా- అర్జున్ జోడీ ఓ రెస్టారెంట్ లో కనిపించారు. ఆ ఇద్దరూ ముంబైలోని ఓ ఖరీదైన హోటల్ కి లంచ్ డేట్ కి వెళ్లారు. అంతేకాదు వీళ్లతో పాటు వేరొక స్పెషల్ గెస్ట్ ప్రత్యక్షమై పెద్ద షాకిచ్చాడు. ఆ చిన్నారి బాలకుడు ఎవరు? అని ఆరాతీస్తే మలైకా- ఆర్భాజ్ జంటకు జన్మించిన కుమారుడు అర్హన్ ఖాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. అతడు- ఆమె మధ్యలో ఆ చిన్నారి ఎవరు? అంటూ ఒకటే ఆసక్తికర డిబేట్ సాగుతోంది. అతడు మలైకా వారసుడికి బాడీగార్డా? అంటూ పంచ్ లు పడుతున్నాయ్.