Begin typing your search above and press return to search.

ఇల్లీ లవర్ కి ఛాన్సులు ఇవ్వండయ్యా

By:  Tupaki Desk   |   31 Aug 2016 10:30 PM GMT
ఇల్లీ లవర్ కి ఛాన్సులు ఇవ్వండయ్యా
X
రుస్తొం మూవీతో అక్షయ్ కుమార్ తిరుగులేని విజయం సాధించాడు. 100 కోట్ల క్లబ్ ని రుస్తొం అవలీలగా దాటేయగా.. 200 కోట్ల క్లబ్ ని అందుకోవడం కూడా ఖాయమే అంటున్నారు. ఈ మూవీతో అక్షయ్ కుమార్ పేరిట మరిన్ని రికార్డులు నమోదు కాగా... హీరోయిన్ ఇలియానా కూడా సాలిడ్ హిట్ కొట్టినట్లయింది.

అయితే.. ఈ మూవీలో ఇల్లీతో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో అర్జాన్ బజ్వా నటించాడు. పోనీ ఇలా చెబితే అర్ధం కాదంటే.. తెలుగు సంపంగి.. నీ తోడు కావాలి వంటి సినిమాలతోపాటు.. భద్రలో రవితేజకు ఫ్రెండ్ గా నటించిన దీపక్ గుర్తున్నాడా? అతడే ఈ అర్జాన్. రుస్తొంతో ఈ హ్యాండ్సమ్ టార్జాన్ ఖాతాలో కూడా వంద కోట్ల సినిమా పడ్డట్లయింది. ఆ ఆనందాన్ని పంచుకునేందుకు థ్యాంక్స్ అంటూ నోట్స్ పంపిస్తున్నాడు దీపక్.

బాలీవుడ్ లో ఓ సినిమా హిట్ అయితే.. అందులో ఓ చిన్న కేరక్టర్ చేసిన దీపక్.. ఇక్కడి నిర్మాతలకు థ్యాంక్యూ అంటూ నోట్స్ పంపించడంలో అంతరార్ధం అర్ధం చేసుకునేందుకు పెద్దగా టైమ్ పట్టదు. నాకు మార్కెట్ ఉంది.. నా సినిమా కూడా హిట్ అయింది.. అంటూ దర్శక నిర్మాతలకు వలవేసే పనిపై ఉన్నాడని అర్ధమవుతోందా! మరి ఇల్లీ ఆన్ స్క్రీన్ లవర్ కి ఆఫర్లు ఇచ్చేదెవరో!