మెల్ట్ చేస్తున్న జల్సా హీరోయిన్ సిస్టర్

Thu Oct 12 2017 17:57:31 GMT+0530 (IST)

2005లో వెన్నెల సినిమాతో వెండితెరకు పరిచయమైన భామ పార్వతి మెల్టన్. ఆ తర్వాత ఛాన్సులు అంతగా రాకపోయినా ఎదో అలా నెట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్లీ కనిపించని ఆ భామ సడన్ గా దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి థ్రిల్ చేసింది.ఇక తర్వాత బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చినా ఏ మాత్రం సక్సెస్ అవ్వలేదు ఈ ఎన్నారై భామ. అయితే పార్వతి పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో నే ఎక్కువగా ఉంటోంది. తన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా పార్వతి తన చెల్లెలు సితార మెల్టన్ బికినీ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సడన్ షాక్ ఇచ్చింది. సితార కూడా సోషల్ మీడియాలో చాలా చురుగ్గానే ఉంటుంది.

ఎప్పుడు లేని విధంగా ఆమె ఇచ్చిన ఒక ఫొటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది. సముద్ర తీరాల్లో ఉన్న రాళ్లపై ఘాటుగా బికినిలో కనిపించి వావ్ అనిపించేలా చేసింది. అమాయకపు చూపులతో కనిపించే సితార మెల్టన్ అలా కనిపించే సరికి ఈమె కూడా హీరోయిన్ అయిపోతుందా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అమ్మడు పోజులను చూస్తుంటే హీరోయిన్ గా ట్రై చేయడానికి ఇలా చేస్తుందా లేదంటే మోడలింగ్ లో సెటిల్ అవుతుందా అన్నట్లే ఉంది.