ఫోటో స్టొరీ: అరియానా Vs ప్రియాంక

Fri Nov 09 2018 18:52:46 GMT+0530 (IST)

ఒకే స్టైల్ డ్రెస్ ఇద్దరు వేసుకుంటే ఒకేలా ఉంటుందా? కొన్ని డ్రెస్ లు కొందరికి సెట్ అవ్వవు. కొన్నేమో కొందరికే సెట్ అవుతాయి. ఇక సెలబ్రిటీల గురించి.. అందులోనూ ఫ్యాషన్ ఐకాన్ ల గురించి మాట్లాడుకుంటే సిమిలర్ డ్రెస్సులు వేసుకుంటే పోలికలు తప్పవు. తాజాగా గ్లోబల్ సుందరి ప్రియాంక.. పాప్ సింగర్ అరియానా గ్రాండ్ ల డ్రెస్ గురించి అలాంటి  పోలికే వచ్చింది.కొన్ని రోజుల క్రితం ప్రియాంక రెండు ఫ్రంట్ స్లిట్స్ ఉండే గ్రే కలర్ డియోన్ లీ బ్లేజర్ తో తళుక్కున మెరిసింది.  అప్పట్లో ఆ డ్రెస్ గ్లోబల్ గా హాట్ టాపిక్ అయింది.  తాజాగా అలాంటి డ్రెస్సే గానీ కాస్త తేడా ఉన్న గ్రే కలర్ డియోన్ లీ బ్లేజర్ ను అరియానా వేసుకుంది.  'బ్రీతిన్' పేరుతో రిలీజ్ అయిన తన సాంగ్ వీడియోలో అరియానా ఈ డ్రెస్ ధరించింది. ఇంకేముంది..  వెంటనే పీసీ కి పాప్ సింగర్ కి పోలికలు మొదలయ్యాయి. ఎవరు ఆ డ్రెస్ ను గ్రేస్ తో స్టైల్ గా ధరించారు.. ఇద్దరిలో ఎవరు గొప్ప.. ఇవీ ఫ్యాషన్ ప్రియుల చర్చలు.

ఓవరాల్ గా అందరి వోటు ప్రియాంక చోప్రాకే పడింది. ఎందుకంటే స్లిట్స్ ను డేర్ గా అలా వదిలేయడం.. ఆ కాన్ఫిడెన్స్.. అన్నిటిలో ప్రియాంక ఆరియనాను దాటేసింది. మన ఇండియన్ బ్యూటీ ఇలా ఒక ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ను ఫ్యాషన్ విషయంలో ఓడించడం అంటే మాటలు కాదుగా? అందుకేనేమో బాలీవుడ్ బ్యూటీ అనకుండా ఈమధ్య అందరూ పీసీని గ్లోబల్ సుందరి అని పిలుస్తున్నారు!