ఇది బాలీవుడ్ లో కొత్త లవ్ జంటా?

Wed Jan 23 2019 07:00:01 GMT+0530 (IST)

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - సారా అలీ ఖాన్ జంటగా నటించిన 'కేదార్ నాథ్'పై వచ్చిన వివాదాల సంగతేమోగానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ సినిమా విజయం సాధించింది.  ఈ సినిమా సారాకు బాలీవుడ్ డెబ్యూ ఫిలిం కావడం విశేషం.  ఈ సినిమాలో సుశాంత్ - సారా ల మధ్య కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇదిలా ఉంటే ఈ జంట రియల్ లైఫ్ లో కూడా లవ్ లో పడ్డారనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.లాస్ట్ ఇయర్ దాదాపు బాలీవుడ్ లవ్ జంటలు అందరూ పెళ్ళి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. రణబీర్-అలియా.. అర్జున్-మలైకా జంటల పెళ్లి బాజాలు మాత్రం ఈ ఏడాదిలో ఉంటాయని వార్తలు వస్తున్నాయి.  సుశాంత్-సారా లు ఇంకా అంత దూరం పోలేదట గానీ డేటింగ్ మాత్రం స్టార్ట్ అయిందట.  రీసెంట్ గా ఒక టాక్ షో లో ఎవరిపైన అయినా క్రష్ ఉందా అని అడిగితే ఒక హీరో పై క్రష్ ఉందని సారా చెప్పింది కానీ ఆ హీరో పేరు వెల్లడించలేదు.

ఆమె వెల్లడించకపోయినా ఆ హీరో సుశాంతేనని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఈమధ్య సుశాంత్ తన 33 వ పుట్టిన రోజును జరుపుకుంటే సారా తన డెహ్రాడూన్ ట్రిప్ ను కుదించుకుని మరీ బర్త్ డే పార్టీకి హాజరయిందట.  బర్త్ డే రోజు రాత్రి సుశాంత్ అపార్ట్ మెంట్ దగ్గరకు కేకుతో ప్రత్యక్షం అయిందని అంటున్నారు. అంతటితో ఆగితే ముంబై నుండి పొగ ఇక్కడిదాకా ఎందుకు వస్తుంది?  ఆ కేకు కటింగ్.. ఈటింగ్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ కు వెళ్ళారట.  ఆ తర్వాత సారాను భద్రంగా వాళ్ళ ఇంటిదగ్గర దింపి మరీ సుశాంత్ తన ఇంటికి వెళ్ళాడట.  దీంతో ఇది కొత్త బాలీవుడ్ ప్రేమ జంట అని వార్తలు గుప్పుమంటున్నాయి.