వీర రాఘవ ఫ్యాన్స్ రచ్చ!

Thu Oct 11 2018 09:49:43 GMT+0530 (IST)

సినిమాల రిలీజ్ ల వేళ స్టార్ హీరోల అభిమానుల మధ్య గడబిడ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో లుక్ - స్టామినా దగ్గర నుంచి బాక్సాఫీస్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని డీప్ గా పట్టించుకునేది వీరాభిమానులే. ఒకప్పుడు కిరాణా కొట్టు దగ్గర కూచుని పిచ్చాపాటీగా ఇవన్నీ మాట్లాడుకునేవారు. ఇప్పుడు నేరుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య డిబేట్ సాగుతోంది. టెక్నాలజీ అప్ డేట్ తో ఫ్యాన్స్ మధ్య యుద్ధం జరుగుతోంది.మీవోడు అంత.. మావోడు ఇంత! అంటూ మాటా మంతీ సామాజిక మాధ్యమాల్లోనే సాగుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజీగా `అరవింద సమేత` చిత్రం రిలీజైంది. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ లో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల గురించే కాదు - ఓవర్సీస్ రిపోర్టులపైనా తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రీమియర్లతోనే అమెరికాలో 1మిలియన్ రికార్డును అందుకుంటున్నాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించిన గత చిత్రం `అజ్ఞాతవాసి` ప్రీమియర్లు - ఓవర్సీస్ వసూళ్లతోనూ పోల్చి వీర రాఘవుని ఫ్యాన్స్ లెక్కలు చెబుతున్నారు. 550 లొకేషన్లలో రిలీజైన అజ్ఞాతవాసి కేవలం 1.5 మిలియన్ డాలర్లు మాత్రమే తెస్తే - కేవలం 192 లొకేషన్లలో రిలీజైన `అరవింద సమేత- వీర రాఘవ` 657కె డాలర్లు వసూలు చేసింది. అది గొప్పా?  ఇది గొప్పా? అంటూ ఒకటే డిబేట్ సాగుతోంది.

మొత్తానికి అభిమానుల డిబేట్ కి తగ్గట్టే ఓవర్సీస్ రిపోర్ట్ ప్రకారం.. అరవింద సమేత ఇప్పటికే 485కె డాలర్లు అందుకుని - ప్రీమియర్లతోనే 1మిలియన్ డాలర్ క్లబ్ లో అడుగుపెట్టనుందని - తారక్ కెరీర్ ఓవర్సీస్ బెస్ట్ ఓపెనింగ్ ని ఈ చిత్రం ఇవ్వనుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మొత్తానికి అభిమానుల డిబేట్ ట్రేడ్ లెక్కల్ని ముందే క్యాచ్ చేసే రేంజులో ఉందని అర్థమవుతోంది. ఎంతైనా అప్ డేటెడ్ 2.ఓ వెర్షన్ ఫ్యాన్స్ కదా ఈ రోజుల్లో!