Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఇది వీరరాఘవుడి విధ్వంసం!

By:  Tupaki Desk   |   15 Aug 2018 4:01 AM GMT
టీజర్ టాక్: ఇది వీరరాఘవుడి విధ్వంసం!
X
ఓ నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్.. ఓ మన్మథుడు, అతడు.. ఖలేజా, జల్సా, జులాయి.. అన్నీ కామెడీ ఎంటర్ టైన్ మెంట్స్.. సందర్భానుసారం కామెడీ చేయించడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దిట్ట. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేశ్ తో చెప్పిన సంభాషణలను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటాం. ఇక ఎప్పుడూ సీరియస్ పాత్రలు చేసే మహేష్ బాబు తో ఖలేజా సినిమాలో త్రివిక్రమ్ ఎంత కామెడీ చేయించాడో అందరికీ తెలిసిందే.. మహేష్ కూడా ఇంత కామెడీ చేస్తాడా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా ఇప్పటికీ టీవీలో వస్తే పిచ్చ రేటింగ్ వస్తుందట.. ఎంతో మంది ఇష్టంగా చూస్తుంటారట..

రోజువారి జరిగే కార్యకలాపాల్లో కామెడీని జనరేట్ చేసేలా త్రివిక్రమ్ తన సినిమాలు తీర్చిదిద్దుతుంటారు. మన చుట్టూ ఉండేవాళ్లు, మన ఇంట్లో ఎంత జోవియల్ గా ఉంటామో అదే ఆయన సినిమాల్లో చూపిస్తాడు. కామెడీని పండించడంలో త్రివిక్రమ్ ను మించిన దర్శకుడు ఆయన సమకాలీకుల్లో లేరనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అరవింద సమేత’ మూవీ చేస్తున్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అజ్ఞాతవాసి’ తీశాడు. ఆ సినిమాలో కూడా కామెడీ డోసు ఎక్కువే. దీంతో ఎన్టీఆర్ తో కూడా అలాంటి సినిమానే తీస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యం.. తొలిసారి త్రివిక్రమ్ తన ఫంథాను పూర్తిగా మార్చేశారు. ఓ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నారు.

తాజాగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ మూవీ టీజర్ స్వాతంత్య దినోత్సవ కానుకగా బయటకు వచ్చింది. ఈ టీజర్ ను చూశాక ఒక్కటే అనిపిస్తోంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది త్రివిక్రమా.? లేక వివి వినాయకా.? అంతలా పౌరుషం, మాస్ ఎమోషన్, ఫ్యాక్షన్ పగడను చూపించారు. టీజర్ లో చూస్తే ఎక్కడా త్రివిక్రమ్ స్టైల్ కామెడీ బిట్ కనిపించలేదు. జగపతి బాబు సీరియస్ గా చెబుతున్న డైలాగులు.. ఎన్టీఆర్ కత్తి చేత బట్టి నరకడాలు.. మనుషులను తరమడాలు.. చివరకు ‘ఎంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా’ అనే భారీ ఎమోషన్ డైలాగ్ ను ఎన్టీఆర్ చేత పలికించారు..

ఈ టీజర్ ను బట్టి త్రివిక్రమ్ పూర్తిగా మారిపోయాడని అర్థమైంది. తన సహజశైలి కామెడీ సినిమాలకు భిన్నంగా ‘అరవింద సమేత’ తీశాడని అర్థమవుతోంది. కామెడీని బేస్ చేసుకొని ఇన్నాళ్లు తెలుగు చిత్రసీమపై చెరగని ముద్రవేసిన తివ్రిక్రమ్ తొలిసారి ఈ ఫ్యాక్షన్ కథను ఎంచుకున్నారు. టీజర్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ కొత్త తరహా సినిమా త్రివిక్రమ్ కు విజయాన్ని చేకూరుస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..