అరవింద సమేత డేట్ ఫిక్స్ అయ్యింది

Thu Jun 14 2018 21:55:34 GMT+0530 (IST)

మొత్తానికి సమ్మర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ కళకళలాడింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి  కనిపించడం లేదు. స్టార్ హీరోలు అందరూ బ్రేక్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ పండగలు ఎప్పుడు ఉన్నాయి. సినిమా ఏ టైమ్ కి రిలీజ్ చేస్తే బావుంటుంది అనే విషయంలో ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా తారక్ చరణ్ అయితే పక్క ప్రణాళికతో ఉన్నారు. ఎందుకంటే మళ్లీ జక్కన్న షెడ్యూల్స్ కి అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రాజెక్ట్ లను లెట్ చేయకుండా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.నెక్స్ట్ వచ్చే పెద్ద పండగలలో దసరా ను అందరు టార్గెట్ చేస్తారని తెలిసిందే. ఇక ఈ సమయంలో హాలిడేస్ బాగా వర్కౌట్ అవుతాయి. గత ఏడాది జై లవకుశ సినిమాను దింపి జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేస్తున్న అరవింద సమేత సినిమాను కూడా ఈ ఏడాది దసరా కి వదలనున్నాడు. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చరణ్ మాత్రం సంక్రాంతి కి రానున్నాడు. బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తారక్ త్రివిక్రమ్ వారి పనులకు గ్యాప్ ఇవ్వడం లేదు. మొదటిసారి మాటల మాంత్రికుడు బ్రేక్ లేకుండా ఒక సినిమా సినిమాను నాన్ స్టాప్ గా తెరకెక్కిస్తున్నాడు. ఫైనల్ గా అక్టోబర్ 10 అని రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఆ రోజు బుధవారం వస్తోంది. ఇక సెలవులు 8వ తేదీ నుంచే ఉంటాయి. మొదటి వారం సినిమాకు బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా హిట్టు టాక్ తెచ్చుకుంటుంది. ఇక యూఎస్ ప్రీమియర్స్ విషయంలో కూడా సినిమాకు రిలీజ్ డేట్ కలిసొచ్చే అవకాశం ఉంది.