Begin typing your search above and press return to search.

అరవింద మూడు రోజుల కలెక్షన్లివే

By:  Tupaki Desk   |   14 Oct 2018 9:58 AM GMT
అరవింద మూడు రోజుల కలెక్షన్లివే
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరును అలానే కొనసాగిస్తోంది. మొదటి రోజే రూ. 26 కోట్లకు పైగా షేర్ తో భారీ ఓపెనింగ్స్ సాధించి నాన్ - బాహుబలి రికార్డు నెలకొల్పిన ఎన్టీఆర్ సినిమా మూడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.65 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గినట్టు అనిపించినా ఈరోజు ఆదివారం కావడంతో మెరుగైన కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉంది. దసరా హాలిడే సీజన్ కావడం.. కాంపిటీషన్ లో మరో చిత్రం లేకపోవడంతో 'అరవింద సమేత' జోరుకు ఇప్పుడే బ్రేకులు పడే సూచనలు కనిపించడం లేదు. తారక్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'అరవింద సమేత' నిలిచే అవకాశం ఉండి ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

'అరవింద సమేత' మొదటి మూడు రోజుల కలెక్షన్స్ వివరాలపై ఒక లుక్కేయండి.

నైజాం - 11.16 cr

సీడెడ్ - 9.13 cr

ఉత్తరాంధ్ర - 4.77 cr

ఈస్ట్ - 3.64 cr

వెస్ట్ - 2.99 cr

కృష్ణ - 3.00 cr

గుంటూరు - 5.44 cr

నెల్లూరు - 1.55 cr

Total - Rs 41.70 cr (ఏపీ + తెలంగాణా 3 రోజుల షేర్)