Begin typing your search above and press return to search.

అర‌వింద స్వామికి పుత్రోత్సాహం!

By:  Tupaki Desk   |   20 May 2018 6:27 AM GMT
అర‌వింద స్వామికి పుత్రోత్సాహం!
X
పుత్రోత్సాహ‌ము తండ్రికి పుత్రుడు జ‌న్మించిన‌పుడు క‌లుగ‌దు.....జ‌నులా పుత్రుని క‌నుగొని పొగ‌డ‌గ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమ‌తీ.... క‌న్న కొడుకులు పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన‌పుడు ఈ సుమ‌తీ శ‌తకాన్నిస్మ‌రించుకుంటాం. క‌న్న‌తండ్రి ఎంత గొప్ప‌వాడైన‌ప్ప‌టికీ....త‌న కొడుకు గొప్ప‌వాడైన‌పుడు, మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన‌పుడు ఆ తండ్రి పొందే ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిది. స‌రిగ్గా ఇపుడు అదే ఆనందాన్ని కోలీవుడ్ వెట‌ర‌న్ యాక్ట‌ర్, అల‌నాటి హ్యాండ్స‌మ్ హీరో అర‌వింద స్వామి పొందుతున్నాడు. ప్ర‌స్తుతం....అర‌వింద స్వామి త‌న కొడుకు రుద్ర స్వామిని చూసి గ‌ర్వ ప‌డుతున్నాడు. ఐబీ ప్రోగ్రామ్ నుంచి రుద్ర స్వామి గ్రాడ్యుయేట్ కావ‌డంతో అర‌వింద స్వామి చాలా సంతోషంగా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ అయిన త‌న కొడుకు రుద్ర‌స్వామిని చూసి గ‌ర్వంగా ఉందంటూ వారిద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ హ్యాండ్స‌మ్ తండ్రీ కొడుకుల ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌న వార‌సుడిని అర‌వింద స్వామి తెరంగేట్రం చేయిస్తాడో లేదో వేచి చూడాలి.

90 వ ద‌శ‌కంలో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హ్యాండ్ స‌మ్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు అర‌వింద స్వామి. బొంబాయి, మెరుపు క‌ల‌లు, ద‌ళ‌ప‌తి వంటి ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి మెప్పించాడు. కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న అర‌వింద స్వామి....త‌నీ ఒరువ‌న్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టాడు. ఆ సినిమా రీమేక్ `ధృవ‌`లో కూడా న‌టించి టాలీవుడ్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్ర‌స్తుతం స్టైలిష్ విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా అర‌వింద స్వామి దూసుకుపోతున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా తమిళ చిత్రం `భాస్క‌ర్ ఒరు రాస్క‌ల్`...బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హ్యాండ్స‌మ్ తండ్రీ కొడుకుల ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌న వార‌సుడిని అర‌వింద స్వామి తెరంగేట్రం చేయిస్తాడో లేదో వేచి చూడాలి.