Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్: మోషన్ పోస్టర్లో కొత్త ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   20 May 2018 5:19 AM GMT
బర్త్ డే స్పెషల్: మోషన్ పోస్టర్లో కొత్త ఎన్టీఆర్
X
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని తమ బేనర్లో అతను నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చూపిస్తున్న ఆ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాత్రికి ఎన్టీఆర్ క్లాస్ లుక్ ఒకటి లాంచ్ చేశారు. అందులో కాఫీ తాగుతూ కూల్ గా భలే ఉన్నాడు తారక్. ఈ రెండు కానుకలకు తోడు ఈ రోజు ఉదయం మూడో బహుమతిని కూడా అందించారు అభిమానులకు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఎన్టీఆర్ మరోసారి క్లాస్ అండ్ కూల్ లుక్ లో కనిపించాడిందులో.

ఈ పోస్టర్లో హీరోయిన్ పూజా హెగ్డేను కూడా చూపించారు. ఇద్దరూ కలిసి పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ పోస్టర్ కు తమన్ క్లాసీగా అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆహ్లాదం పంచాడు. నందమూరి తారకరామారావుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ అచ్చ తెలుగులో శుభాకాంక్షలు చెప్పింది హారిక-హాసిని సంస్థ. మొత్తానికి ‘అరవింద సమేత వీర రాఘవ’ ఒక్క రోజు వ్యవధిలో జనాల్లోకి బాగా వెళ్లిపోతోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మరీ ఈ స్థాయిలో హడావుడి ఉంటుందని అభిమానులు కూడా ఊహించి ఉండరు. సినిమా మొదలైన నెలన్నరకే అభిమానులకు చాలా వినోదాన్ని అందించేశారు. ఇక మున్ముందు ఎలా సినిమాను ప్రమోట్ చేస్తారో.. ఎలాంటి విశేషాలు పంచుకుంటారో చూడాలి. రాయల సీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం నడుస్తుందని అంటున్నారు. దసరా కానుకగా అక్టోబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.