ఐఫోన్8.. సెల్రబిటీలు విసిగిస్తున్నారు

Wed Sep 13 2017 12:36:09 GMT+0530 (IST)

ఐఫోన్ లో కొత్త వెర్షన్ వచ్చేసింది. యాపిల్ కంపెనీ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసింది. ఐఫోన్ 8.. ఐఫోన్ 8ప్లస్.. ఐఫోన్ X.. లను ప్రకటించేసింది. డిజైన్ లో పెద్దగా మార్పులు చేయని కంపెనీ.. ఐఫోన్ 6 ప్లస్ నుంచి కొనసాగిస్తున్న లుక్ నే కంటిన్యూ చేసింది. అయితే.. ఫోన్ స్పెసిఫికేషన్స్ కంటే మనోళ్ల హంగామా ఎక్కువగా ఉంది.నిజానికి ఐఫోన్ ను అనౌన్స్ చేసిన తర్వాత.. అది మార్కెట్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని(తెలియని) చాలమంది మన సెలబ్రిటీలు రాత్రంతా అమెరికాకు తెగ ఫోన్లు చేసేశారట. ఫోన్ స్టోర్ లో దొరికితే కొనేసి పట్టుకు రమ్మంటూ అని విసిగించేస్తున్నారట. ముఖ్యంగా హీరోలూ హీరోయిన్ల నుంచి ఈ హంగామా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీళ్లకు అర్జెంటుగా ఐఫోన్8 మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా... ప్రెస్ మీట్లలో ఈ కొత్త ఐఫోన్ 8 చేతిలో పట్టుకుని.. నాకన్నీ ముందే  వచ్చేస్తాయి.. స్టీవ్ జాబ్స్(2011లోనే మరణించారు) మా బాబాయే అన్నట్లు బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నారు.

నిజానికి ఈ నెల 15 నుంచి ఐఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి అఫీషియల్ గా సేల్స్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే అఫ్పటికి చాలా మంది చేతుల్లోకి ఐఫోన్స్ వచ్చేసి ఉంటాయి. ఈ లోగానే తమ గొప్పదనం చాటి చెప్పేయాలనేది వీరి మహోన్నతమైన ఆలోచన. అందులో సాధ్యాసాధ్యాల సంగతి కూడా పెద్దగా ఆలోచించుకోకుండానే.. రచ్చ స్టార్ట్ చేసేశారు. చూద్దాం ఇందులో ఎంతమంది సక్సెస్ అవుతారో?