Begin typing your search above and press return to search.

స‌వాల్.. ఈ న‌టుడెవ‌రో గుర్తుప‌ట్టండి

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 AM GMT
స‌వాల్.. ఈ న‌టుడెవ‌రో గుర్తుప‌ట్టండి
X
‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్ తో.. 90ల నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో సినిమా తెర‌కెక్కిస్తున్నాడు ‘అయ్యారే’ ఫేమ్ సాగ‌ర్ చంద్ర‌. నారా రోహిత్.. శ్రీవిష్ణు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టిదాకా వ‌చ్చిన పోస్ట‌ర్లు భ‌లే ఆస‌క్తి రేకెత్తించాయి. కొన్నాళ్ల విరామం త‌ర్వాత ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సినిమా టీం ఓ కాంటెస్టుతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసి.. ఇందులో ఉన్న న‌టుడెవ‌రో గుర్తించి త‌మ‌కు పంపితే బ‌హుమ‌తులు అందిస్తామ‌ని పేర్కొంది.

ఈ పోస్ట‌ర్లో క‌నిపించే న‌టుడు ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ సినిమాలో విఠ్ఠ‌ల్ సేట్ అనే పాత్ర చేస్తున్నాడు. దీన్ని ఇండికేట్ చేస్తూ.. విఠ్ఠ‌ల్ సేట్ అని అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అంటూ టైటిల్ కు లింకు క‌లిపారు. కాస్త ప‌రిశీల‌నగా చూస్తే ఈ న‌టుడు ఎవ‌ర‌న్న‌ది చెప్పేయొచ్చు. ఈ ఫోటోలో ఉన్న నటుడెవరో గుర్తుపట్టి కింద పేర్కొన్న నెంబర్ (7093909777)కు వాట్సాప్ చేయాల్సిందింగా టీమ్ కోరుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం 1992-96 మధ్య కాలం నేపథ్యంలో సాగుతుందట. ఇందులో రోహిత్ నూరుద్దీన్ అనే ముస్లిం పాత్ర పోషిస్తుండటం విశేషం. శ్రీవిష్ణు ఓ క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నాడు. మహాభారతం స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నాడు సాగర్ చంద్ర. క్రికెట్.. మాఫియా.. గ్లోబలైజేషన్.. లాంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/