Begin typing your search above and press return to search.

కేసును ఉపసంహరించుకున్న అపూర్వ

By:  Tupaki Desk   |   25 May 2016 4:18 AM GMT
కేసును ఉపసంహరించుకున్న అపూర్వ
X
తనకు ప్రాణ భయం ఉందని, కొందరు బెదిరిస్తున్నారంటూ సినీ నటి అపూర్వ పోలీస్ కేస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 21 ఫిలిం సిటీ సమీపంలో టాలీవుడ్ నటి అపూర్వ ప్రయాణిస్తున్న కారను.. మరో కారుడ ఢీ కొట్టింది. చౌటుప్పల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాపాయం సంభవించకపోయినా.. ఈ యాక్సిడెంట్ లో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతింది.

సిద్ధార్ధ నగర్ లో నివాసం ఉంటున్న ఈమె.. ఈ ప్రమాదంపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అపూర్వ ఫిర్యాదు నమోదు చేసింది. అయితే తాజా పరిస్థితుల్లో పాడైపోయిన కారును రిపేరు చేయించేందుకు అవతలివారు ఒప్పుకోవడంతో.. కేసు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. అలాగే.. అపూర్వ కారు పూర్తిగా బాగయ్యే వరకు తమ కారును ఈమె ఇంటి దగ్గరే ఉంచేందుకు కూడా వారు అంగీకరించారు.

దీనికి ముందు కొందరు బెదిరిస్తున్నారని, ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు చెప్పింది అపూర్వ. అలాగే సిద్ధార్ధ నగర్ లోని తన ఇంటిముందు కొందరు తిరుగుతూ కనిపిస్తున్నారని.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే ప్రస్తుతం అన్ని సమస్యలు సెటిల్ అయినట్లు.. అపూర్వ తన కేసును ఉపసంహరించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.