Begin typing your search above and press return to search.

కొత్త పిల్లను బేటా అనేసిన హీరో

By:  Tupaki Desk   |   16 Aug 2017 12:39 PM GMT
కొత్త పిల్లను బేటా అనేసిన హీరో
X
బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. వారు తెరకెక్కించే ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త తరహ కథనం ఉంటుంది. అందుకోసం వారు క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే రీసెంట్ గా వారు తెరకెక్కించిన "కైదీ బ్యాండ్" సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్న సందర్బంగా చిత్ర నటి నటులలతో ప్రమోషన్స్ ని బాగానే చేయిస్తున్నారు. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్న హీరోయిన్ అన్యా సింగ్.. హీరో రన్వీర్ సింగ్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసింది.

ముందుగా రన్వీర్ అంటే తనకు చాలా ఇఇష్టమని మని, ఆయనంటే ఎంతో అభిమానమని చెప్పింది. అంతే కాకుండా ఆయనతో మొదటిసారి చుసిన సందర్భాన్ని కూడా చెప్పింది ఈ బ్యూటీ. రన్ బీర్ గారిని మొదటి సారి యాష్ రాజ్ ఫిలిమ్స్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆదిత్య చోప్రా గారు కథ వినడానికి రమ్మన్నారు. దీంతో తాను అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా రన్వీర్ ని చూసి షాక్ షాక్ అయ్యిందట. ఆయన కంగ్రాట్స్ బేటా అని చెప్పడంతో తాను మళ్ళీ షాక్ అయ్యిందట అలాగే మరొకసారి తన సినిమా ట్రైలర్ లాంచ్ రన్వీర్ బర్త్ డే కి ముందు రోజే అయ్యిందని చెప్పింది.

యాష్ రాజ్ స్టూడియో లో ఆ సందర్బంగా మరోసారి ఎదురుపడినప్పుడు ట్రైలర్ లో చాలా బాగున్నావ్ ఆల్ ది బెస్ట్ బేటా అని చెప్పడంతో అన్య సింగ్ చాలా సంబరపడిపోయిందట. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని ఆయనతో కలిసి కొంత సేపు ప్రేమాగా మాట్లాడానని చెప్పేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.