Begin typing your search above and press return to search.

సాంకేతికత అండగా.. స్వీటీ సన్నగా..

By:  Tupaki Desk   |   23 Oct 2016 9:30 AM GMT
సాంకేతికత అండగా.. స్వీటీ సన్నగా..
X
ఎట్టకేలకు ఎన్నాళ్లకెన్నాళ్లకో టాలీవుడ్ స్వీటీ అనుష్క పబ్లిక్ లో కనిపించింది. బాహుబలి2 ఫస్ట్ లుక్ లాంఛ్ సందర్భంగా ముంబైలో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఎంత పొడుగ్గా ఉన్నా పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేసే అనుష్క.. ఈ మధ్య లావయిపోయిన సంగతి తెలిసిందే. వెయిట్ లాస్ వర్కవుట్స్ లాంటివేవో చేస్తుండడంతో.. స్వీటీ సన్నబడుతుందని ఆశించిన అభిమానులకు.. ముంబై ఈవెంట్ ను అనుష్కను చూడగానే షాక్ తగిలింది.


ఏదో కొంచెం తప్ప అనుష్క అంతగా స్లిమ్ అయినదేమీ లేదు. మరి దేవసేనగా బాహుబలి2లో ప్రధాన పాత్ర పోషించాల్సిన పరిస్థితేంటి? మూడేళ్ల క్రితం తీసిన సీన్స్ కు.. రీసెంట్ షూట్ చేసిన సన్నివేశాల్లో ఇప్పటి అనుష్కకు తేడా కనిపించదా అనుకోవచ్చు కానీ.. అక్కడే టెక్నాలజీని తోడు తెచ్చుకున్నాడట దర్శకుడు రాజమౌళి. ఎలా ఉన్నవాళ్లని అలాగే షూట్ చేసేసి.. ఆన్ స్క్రీన్ పై మాత్రం గ్రాఫిక్స్ సాయంతో సన్నగా చూపించే టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సాంకేతికతకు మంచి రెప్యూటేషన్ వచ్చింది.

రీసెంట్ వచ్చిన ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీలో.. టీనేజర్ గా కనిపిచేందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఈ టెక్నాలజీనే ఉపయోగించారు. ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన షారూక్ మూవీ ఫ్యాన్ కోసం కూడా ఈ టెక్నాలజీపైనే డిపెండ్ అయ్యారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఈ సాంకేతికతను అండగా తీసుకుని.. స్వీటీని.. అదేనండీ దేవసేనను సన్నగా చూపించేయనున్నాడట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/