Begin typing your search above and press return to search.

అనుష్క అంత క్రూరంగా మారిపోయిందా!!

By:  Tupaki Desk   |   29 April 2016 9:22 AM GMT
అనుష్క అంత క్రూరంగా మారిపోయిందా!!
X
అనుష్క శర్మ బాలీవుడ్ హాట్ భామల్లో ఒకరు. ఈ సుందరాంగి నుంచి పెర్ఫామెన్స్ కేరక్టర్లు ఎక్స్ పెక్ట్ చేయడంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ మరీ ఫైటర్, రెజ్లర్ అవతారం ఎత్తేస్తే ఎలా ఉంటుంది.. ఇప్పటివరకూ దీనిపై ఆలోచన తప్ప క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ లో.. అనుష్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్.

సుల్తాన్ లో అనుష్క శర్మ.. ఆర్ఫా అనే పాత్రలో కనిపిస్తోంది. ఓ మల్లయుద్ధ వీరుడిని ఎత్తి పడేస్తున్న ఈమెను చూస్తే.. సుకుమారి అనే మాటను మర్చిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఫైటింగులు చేసేస్తోంది. ఈ పాత్ర చేసేందుకు అనుష్క బోలెడు ట్రైనింగ్ తీసుకుంది. కొన్ని నెలలపాటు ట్రైనింగ్ అయి.. మల్ల యుద్ధాల సన్నివేశాల్లో పాల్గొంది అనుష్క. కొన్ని రోజుల క్రితం సల్మాన్ కూడా ఇలాంటి షాక్ నే ఇచ్చాడు. ఇప్పటివరకూ సల్లూ భాయ్ కనిపించనంత స్ట్రెంగ్త్ చూపించాడు.

ఈ పవర్ ఫుల్ రోల్ కి సల్మాన్ సరిగ్గా న్యాయం చేశాడనే కామెంట్స్ వినిపించాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. సుల్తాన్ చిత్రం జూలై 6న విడుదల కానుంది.